Tollywood: మెకానిక్ తో కీర్తి సురేష్ రొమాన్స్ ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేను శైలజ..సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కీర్తి సురేష్… ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్గా కొనసాగుతోంది. నేను శైలజ తర్వాత నాని హీరోగా చేసిన నేను లోకల్ సినిమాలో నటించి అందరి మన్ననలను పొందింది కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి వరుసగా ఆఫర్లు వచ్చాయి.

ముఖ్యంగా ఈ బ్యూటీ చేసిన మహానటి సినిమాతో… ఆమె స్థాయి ఎక్కడికో వెళ్ళింది. ఈ సినిమాలో నటించినందుకు… కీర్తి సురేష్ కు మహానటి అనే బిరుదు రావడంతో పాటు పలు అవార్డులు కూడా వచ్చాయి. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తోంది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కీర్తి సురేష్ తాజాగా ఓ సినిమా షూటింగ్ కు వెళ్ళింది.

అక్కడే ఉన్న ఒక మెకానిక్ తో సెల్ఫీలు దిగింది కీర్తి సురేష్. అయితే సెల్ఫీలు దిగడం చాలా కామన్.. కానీ ఆ మెకానిక్ తో చాలా క్లోజ్ గా కీర్తి సురేష్ కనిపించింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంకేముంది నెటిజన్లు ఈ బ్యూటీని తెగ ఆడుకుంటున్నారు. మెకానిక్ తో కీర్తి సురేష్ రొమాన్స్ చేస్తూ ఉందని… అతనితో ఎఫైర్ పెట్టుకుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే కీర్తి సురేష్ ఫ్యాన్స్ మాత్రం చాలా భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక కామన్ ఫ్యాన్ తో ఫోటో దిగితే ఇలాంటి అఫైర్ అంటగడతారా? అని ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై కీర్తి సురేష్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు