Samantha : అప్పుడే రెండో పెళ్లా ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ లోనూ బిజీ అవుతుంది. ఇప్పటికే సామ్ రెండు బాలీవుడ్ ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కెరీర్ పరంగా సమంత దూసుకెళ్తుంది. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో క్రేజ్ ను విపరీతంగా పెంచుకుంటుంది. అక్కినేని నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా సామ్ స్పీడ్ తగ్గలేదు. నాగ చైతన్య తో గత ఏడాది డిసెంబర్ లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల వీళ్ల పెళ్లి బంధానికి విడాకులు పడ్డాయి.

విడాకులు సమంత కెరీర్ పై ప్రభావం చూపిస్తాయని అందరూ భావించారు. కానీ, సమంత వరుసగా సినిమాలు చేస్తూ రోజు రోజుకు తన ఇమేజ్ ను పెంచుకుంటుంది. ఇది ఇలా ఉండగా, సమంత గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏంటంటే.. సామ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందట. బాలీవుడ్ కు చెందిన ఒక యంగ్ హీరోతో ఈ భామ ప్రేమలో పడినట్లు సమాచారం అందుతుంది. త్వరలోనే వీళ్లు పెళ్లీ పీటలెక్కడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

అయితే ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా నాగ చైతన్యతో డైవర్స్ తీసుకున్న తర్వాత.. తాను ఒంటరి జీవితాన్నే గడపడానికే ఇష్టపడుతున్నట్లు పలు సందర్భాల్లో సామ్ చెప్పింది. పెళ్లి, ప్రేమ లకు దూరంగా ఉంటానని కూడా చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇలాంటి వార్తలు రావడం సమంత అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఏది ఏమైనా ఈ వార్తలకు బ్రేక్ పడాలంటే.. స్వయం సమంత స్పందించాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు