Puspa: పుష్ప @2 యేళ్లు.. అల్లు అర్జున్ అందుకున్న అవార్డులు ఎన్నో తెలుసా..?

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరుపొందిన డైరెక్టర్ సుకుమార్ లెక్కలు మాస్టర్ గా పేరు సంపాదించారు.. సుకుమార్ ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అబ్బుర పరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం పుష్ప ది రైజ్.. ఈ సినిమా 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికి ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు కావస్తోంది. దీంతో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎలాంటి అవార్డులు అందుకున్నారనే విషయంపై అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు.

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ అందుకున్న అవార్డుల విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సంబంధించి కలెక్షన్స్ విషయంలో కూడా ఒక సెన్సేషనల్ క్రియేట్ చేశారని చెప్పవచ్చు. పాటలను, డైలాగులు ఇతరత్రా మేకోవర్స్ ఎక్కువగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడం జరిగింది. పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.365 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి హైయెస్ట్ టాప్-10 లో చోటు సంపాదించుకుంది.

1). మొట్టమొదటిగా ఆల్బమ్స్ కు 6 మిలియన్ వ్యూస్ సైతం రాబట్టుకున్న చిత్రంగా అందుకుంది.
2).10 మిలియన్స్ కి పైగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఉన్నాయి.
3). ఫిలింఫేర్ అవార్డ్-7, సాక్షి అవార్డ్-7
4). నేషనల్ ఫిలిం అవార్డ్స్ -2
5). ఇండియన్ ఫిలిం ఆఫ్ ది ఇయర్ గా దాదాసాహెబ్ పాల్కే అవార్డుని అందుకోవడం జరిగింది.
6). ఉత్తమ నటుడుగా అల్లు అవార్డు జాతీయ అవార్డును అందుకున్న ఏకైక హీరోగా ఆల్ టైం రికార్డ్ సృష్టించారు.
7). ప్రైమ్ లో అత్యధికంగా వ్యూస్ రాబట్టిన ఇండియన్ చిత్రంగా పేరు సంపాదించింది.
8). 2002 లో అత్యధికంగా తెలుగు వర్షన్ కు హైయెస్ట్ టిఆర్పి రేటింగ్ దక్కించుకున్న చిత్రంగా నిలిచింది.2021 లో అత్యధికంగా వసూలు సాధించిన సినిమాగా ఇండియన్ ఫిలిమ్స్ లో అవకాశం అందుకుంది.

- Advertisement -

ఇలాంటి ఎన్నో రికార్డులను సృష్టించిన పుష్ప సినిమా సీక్వెల్ కూడా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర బృందం పలు రకాల సన్నహాలు చేస్తోంది. రష్మిక హీరోయిన్గా నటించగా అనసూయ, ఫహద్ ఫాజీల్, సునీల్, రావు రమేష్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు