Ram Charan: గేమ్ చేంజర్ ని శంకర్ లైట్ తీసుకున్నాడా..?

RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అవుతోంది. ఆ మధ్య రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్ప్స్ మినహా ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. ఈ విషయంలో మెగా అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. రామ్ చరణ్ నటించిన గత చిత్రం ఆచార్య డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్ వంటి తెలుగు నటులతో పాటు పలువురు తమిళ నటులు కూడా నటిస్తున్నారు.

ఈ సినిమా 2023లోనే రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసిన సినిమా యూనిట్, ఈ సినిమా షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. డైరెక్టర్ శంకర్, ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ తో ఇండియన్2 కూడా షూట్ చేస్తుండటం వల్ల గేమ్ చేంజర్ ఆలస్యం అవుతుందని వార్తలొచ్చాయి ఆ మధ్య. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబుతో కలిసి సినిమా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్న క్రమంలో శంకర్ ఈ సినిమాను నిర్లక్ష్యం చేస్తున్నాడని రామ్ చరణ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మొదట్లో 2023 జనవరిలో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ షూటింగ్ ఆలస్యం అవ్వటం వల్ల వాయిదా పడింది. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. RRR తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న పాన్ ఇండియా సినిమా కావటం, దర్శకుడు శంకర్ చాలా గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి, సినిమా యూనిట్ చెప్తున్నట్టుగానే గేమ్ చేంజర్ 2023లోనే విడుదల అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు