Asian Cinemas: దూకుడు పెంచిన ఏషియన్ – సింగిల్ స్క్రీన్లకు ముప్పు పొంచి ఉందా..?

ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ ఏషియన్ సినిమాస్ తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వస్తుంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండతో కలిసి మల్టీప్లెక్స్ లు స్థాపించిన ఏషియన్ ఇటీవల ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తో కలిసి మరో మల్టీప్లెక్స్ స్థాపించింది. అంతే కాకుండా కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో కలిసి చెన్నైలో మల్టీప్లెక్స్ స్థాపించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్ లో దాదాపు అన్ని ఏరియాలకు విస్తరించిన ఏషియన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్, దేవి థియేటర్లు  కొని మల్టిప్లెక్స్ గా మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి.ఈ థియేటర్లు అంటే సింగిల్ స్క్రీన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ లాంటివని భవిస్తూ ఉంటారు.

సినీ ప్రేమికులు, హీరోల అభిమానులు తమ హీరోల సినిమాలను ఫస్ట్ డే, ఫస్ట్ షో ఈ థియేటర్లలోనే చూడటానికి ఆసక్తి చూపుతుంటారు. సింగిల్ స్క్రీన్స్ లో సినిమా చూడటంలో ఉన్న కిక్ మల్టీప్లెక్స్ థియేటర్లలో ఉండదని మాస్ ఆడియెన్స్ అభిప్రాయం. ప్రస్తుతం మారుతున్న ఆడియెన్స్ అభిరుచి, పెరుగుతున్న ఓటీటీ కల్చర్ ధాటికి సింగిల్ స్క్రీన్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఇప్పుడు ఏషియన్ లాంటి సంస్థలు లాభాల్లో నడుస్తున్న కొద్దిపాటి సింగిల్ స్క్రీన్స్ ని కూడా మల్టీప్లెక్స్ లుగా మార్చుతున్న నేపథ్యంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.

మల్టీప్లెక్స్ లలో అధునాతన టెక్నాలజీతో టాప్ క్లాస్ సినిమాటిక్ ఎక్సపీరియెన్స్ ఉన్న మాట వాస్తవమే కానీ టికెట్ రేట్లు, స్నాక్స్ రేట్లు సామాన్యునికి అందనంత దూరంలో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా మల్టిప్లెక్స్ గా మారిపోతే సామాన్యుడికి సినిమా చూడటం కూడా భారంగా మారే అవకాశం ఉంది. మరి, కార్పొరేట్ సంస్థల రూపంలో పొంచి ఉన్న ముప్పుని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ఏ రకంగా ఎదుర్కుంటారో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు