RamaBanam: ఫ్లాప్ డైరెక్టర్ తో గోపీచంద్..!

శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందిన రామబాణం సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న గోపీచంద్ కి ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ హై స్పీడ్ లో చేస్తోంది సినిమా యూనిట్. ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తన తదుపరి సినిమాల గురించి అప్డేట్ ఇచ్చాడు గోపీచంద్. ఇప్పటికే దర్శకుడు తేజతో ఓ సినిమా కమిట్ అయిన గోపీచంద్, ఆ తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్లో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని తెలిపాడు.

కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ కూడా స్టార్ట్ చేసినట్టు చెప్పారు. అయితే, చాలా కాలంగా హిట్ లేక మెగా ఫోన్ కి దూరంగా ఉన్న శ్రీనువైట్లకి గోపీచంద్ ఛాన్స్ ఇవ్వటం ఒకింత ఆశ్చర్యంగానే ఉంది. అమర్ అక్బర్ ఆంటోని లాంటి డిజాస్టర్ తర్వాత శ్రీను వైట్లతో సినిమా చేసేందుకు ఏ హీరో, నిర్మాత ముందుకు రాలేదు. ఆ మధ్య విష్ణుతో ఢీ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి కానీ, ఆ ప్రాజెక్ట్ గురించి తర్వాత ఎలాంటి ఊసు లేదు.

కాగా, గోపీచంద్ కెరీర్లో హిట్ కీలకంగా మారిన దశలో రామబాణం సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపీచంద్ ని వెంటాడుతున్న వరుస ఫ్లాపుల పరంపరకు బ్రేక్ పడుతుందా లేదా అన్నది రేపు తేలనుంది. గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు