Yukthi Tareja: ఆ ఫేమస్ సాంగ్ లో నటించింది రంగబలి హీరోయినా?

నాగశౌర్య హీరోగా నటించిన తాజా చిత్రం రంగబలి. జులై 7న విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా జోరుగా చేస్తుంది. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా హర్యానా కి చెందిన యుక్తి తరేజా హీరోయిన్ గా పరిచయమవుతుంది. సినిమా పరంగా కూడా ఇదే తనకి మొదటి సినిమా కావడం విశేషం. అయితే చాలా మందికి ఈ సినిమాతోనే ఈ అమ్మడు ఆడియన్స్ కి తెలుస్తుందని అందరు అనుకుంటున్నారు. కానీ అంతకు ముందే యుక్తి తరేజా ఇండియా వైడ్ గా ఫేమస్ అని చాలా మందికి తెలియదు.

అదెలాగంటే హిందీలో ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చాలా పాపులర్ అని అందరికి తెలిసిందే. అక్కడ పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా అప్పుడప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ లో చేస్తుంటారు. అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ 2021 లో ఒక ప్రైవేట్ సాంగ్ చేయడం జరిగింది. “లుట్ గయే” అనే పేరుతో ఉండే ఈ సాంగ్ లో యుక్తి తరేజా హీరోయిన్ గా ఇమ్రాన్ హష్మీ తో నటించింది. ఈ పాట 2021 లోనే ఇండియాలో హైయెస్ట్ వ్యూయడ్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సాంగ్ ద్వారా యుక్తి తరేజా ఇండియా వైడ్ గా ఫేమస్ అయిపొయింది.

ఈ పాట చూసే రంగబలి లో హీరోయిన్ గా చిత్ర యూనిట్ తీసుకున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన యుక్తి తరేజా ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో కూడా ఆఫర్లు దక్కించుకుందని టాక్ నడుస్తుంది. ఇక ఈ భామ నటించిన రంగబలి ఎలాంటి విజయం దక్కించుకుంటుందో తెలియాలంటే జులై ఏడు వరకు ఆగాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు