Samantha : మిస్ చేసుకుందా?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. “ఏ మాయ చేసావే” సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అంచలంచలుగా ఎదిగి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. మరోవైపు తన మొదటి సినిమా హీరో నాగచైతన్యనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి జరిగి నాలుగేళ్లు గడవక ముందే వీరిద్దరూ విడిపోయి, ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ప్రస్తుతం సమంత భాషలతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు సైన్ చేస్తూ దూసుకుపోతుంది.

అయితే తాజాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో సమంతకి నటించే అవకాశాన్ని ఇచ్చారట. కానీ తాజా సమాచారం ప్రకారం సమంత ఈ ఆఫర్ ని తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులను చేసుకుంటుంది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంతను కొరటాల శివ సంప్రదించరట. దీంతో సమంత నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. వాస్తవానికి కొరటాల శివ సినిమాలో హీరోయిన్లకు అంత ప్రాధాన్యత ఉండదు. దీంతో రెమ్యునరేషన్ డీల్ కుదరకపోవడంతో సమంత ఈ ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా NTR30లో ఇప్పటి వరకు హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు