Pawan Kalyan : అప్డేట్ కోసం ఎదురుచూపులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరుకు ఒక సపరేట్ బ్రాండ్ ఉంది. “నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా” ఇది కేవలం సినిమాలోని డైలాగ్ మాత్రమే కాదు.. పవన్ కళ్యాణ్ జీవితానికి కూడా ఒక ఉదాహరణగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటి నుండి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకోగలిగారు.

అయితే సెప్టెంబర్ 2న పుట్టినరోజు జరుపుకుంటున్న పవన్ 51 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. పవర్ స్టార్ పుట్టినరోజు అంటే మెగా అభిమానులందరికీ పండగ రోజు. పైగా ఈ పుట్టినరోజున పవన్ కళ్యాణ్ నటిస్తున్న “హరిహర వీరమల్లు” మూవీ నుండి బిగ్ అప్డేట్ రానున్నట్లు సమాచారం. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి రెండేళ్ల కింద నుంచే చిత్రంపై ఆసక్తి నెలకొల్పాలా చేశారు. గతేడాది నుంచి షూటింగ్ కు కసరత్తులు ప్రారంభమైన ఈ మూవీ, ఇంకా పూర్తికాలేదు.

అయితే సెప్టెంబర్ 2న జనసేనని బర్త్ డే సందర్భంగా.. హరిహర వీరమల్లు గ్లింప్స్ యాక్షన్ కట్ వీడియోను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ట్వీట్స్ చేస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. మొఘలుల నుండి కోహినూరు వజ్రాన్ని దొంగిలించే నేపథ్యంగా ఈ సినిమా సాగుతుందని సమాచారం. 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో హరి హర వీరమల్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు