Matka : “మట్కా”కు బడ్జెట్ సమస్యలు… ఆపరేషన్ “కాస్ట్ కట్టింగ్” షురూ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమాకు బడ్జెట్ కష్టాలు మొదలయ్యాయా? అంటే… అవును అనే సమాధానమే వినిపిస్తోంది. రీసెంట్ గా “ఆపరేషన్ వాలెంటైన్” మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ కు తీవ్ర నిరాశే ఎదురయ్యింది. ఇప్పుడు ఆ సినిమా ఎఫెక్ట్ కారణంగానే వరుణ్ నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ “మట్కా” బడ్జెట్ సమస్యల్లో పడింది అని సమాచారం.

“ఆపరేషన్ వాలెంటైన్” ప్లాప్ ఎఫెక్ట్ “మట్కా”పై…
వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ “మట్కా”. ఆయన కెరీర్లో 14వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీకి పలాస ఫేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ భారీ బడ్జెట్ ను నిర్మిస్తున్నారు. అయితే వరుణ్ ప్రస్తుతం వరుసగా డిజాస్టర్ లలో ఉండడం వల్ల ఈ మూవీని హోల్డ్ లో పెట్టి, “ఆపరేషన్ వాలెంటైన్” రిజల్ట్ కోసం మేకర్స్ వెయిట్ చేశారు. అయితే ఊహించని విధంగా పుల్వామా దాడుల నేపథ్యంలో ఎయిర్ ఫోర్స్ కథతో రూపొందిన “ఆపరేషన్ వాలెంటైన్” మూవీని ప్రేక్షకులు ఊహించని విధంగా తిరస్కరించారు. ఈ ఎఫెక్ట్ కారణంగానే “మట్కా” విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు నిర్మాతలు. అందులో భాగంగానే బడ్జెట్ ను తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

“మట్కా” కాస్ట్ కటింగ్…
వాస్తవానికి “మట్కా” మూవీని చాలాకాలం క్రితమే మొదలుపెట్టాడు వరుణ్ తేజ్. అయితే ఈ మూవీ బడ్జెట్ సమస్యల కారణంగా ఆగిపోయిందని కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. అలాగే ఇప్పటికే ఒకసారి ఈ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ చేతులు మారింది. అయితే అవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అంటూ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. వరుణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పుడు మరోసారి బడ్జెట్ సమస్యల కారణంగా వార్తల్లో నిలిచింది. “ఆపరేషన్ వాలెంటైన్” ఎఫెక్ట్ కారణంగా “మట్కా” బడ్జెట్ ను సవరించడానికి రెడీ అయ్యారట నిర్మాతలు. ఆ కాస్ట్ కటింగ్ పనిలో ఉండడం వల్లే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారని ఇన్సైడ్ టాక్.

- Advertisement -

డైరెక్టర్ కూడా నెగెటివే…
“మట్కా” మూవీ 60 నుంచి 80వ దశకం మధ్యలో జరిగిన పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ మాఫియా డాన్ బయోపిక్ కి డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ డైరెక్టర్ ఫామ్ లో లేకపోవడం కూడా సినిమాపై నెగిటివ్ ఎఫెక్ట్ పడే అంశమే. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన గత చిత్రం శ్రీదేవి సోడా సెంటర్ ఆయన కెరీర్ లోనే దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ నిర్మాతలు కరుణ కుమార్ మీద నమ్మకంతో “మట్కా” మీద భారీ బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యారు. కానీ దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా వరుణ్ కెరీర్ కూడా ఇప్పుడు దారుణమైన పరిస్థితికి వచ్చేసింది. ఇక ఈ సినిమాకు ఓటిటి, సాటిలైట్, డబ్బింగ్ డీల్స్ కూడా ఇంకా కుదరలేదట. దీంతో “ఆపరేషన్ వాలెంటైన్” పెట్టిన ఈ చిచ్చు “మట్కా”కు చుట్టుకున్నట్టుగా అయింది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు