bigboss season7 update: బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ క్రేజీ లీక్ – మతిపోయే ట్విస్ట్ ఇచ్చారు

bigboss season 7 update

అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యహరిస్తున్న అతి పెద్ద టీవి రియాలిటీ షో బిగ్ బాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు విజయవంతంగా ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే ఏడవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

గడిచిన ఆరు సీజన్లలో మొదటి మూడు, నాలుగు సీజన్లకు విపరితమైన క్రేజ్ వచ్చింది.కానీ ఆ తరువాత వచ్చిన బిగ్ బాస్ షో లో ప్రతి సీజన్ లో ఒకే రకమైన కాసెప్ట్ లు, ఒక విధమైన టాస్క్ లు నిర్వహిస్తుండటంతో నానాటికి బిగ్ బాస్ షో క్రేజ్ పడిపోతూ వచ్చింది. ఇక గడిచిన ఆరవ సీజనైతే మరీ దారుణంగా ఫ్లాప్ అవడంతో పాటు, తీవ్రమైన నెగిటివిటి వచ్చింది. అయితే ఇక ఈ నెగిటివిటీని పాజిటివ్ మార్చడానికి బిగ్ బాస్ యాజమాన్యం సరికొత్త ప్రణాళికతో బిగ్ బాస్ సీజన్ సెవెన్ ను ప్రారంభించడానికి రెడీ అయింది.

వచ్చే సెప్టెంబర్ 3 నుంచి మొదలవబోతున్న ఈ షో కు సంబంధించి ఇప్పటికే కంటిస్టెంట్స్ ఫైనల్ అయినట్టు సమాచారం అందుతోంది. అయితే ఈ ఏడవ సీజన్ లో రెండు హౌస్ లతో బిగ్ బాస్ షో ఉండబోతుందట. ఒక హౌస్ లో 10 మంది కంటిస్టెంట్స్,మరియు మరొక హౌస్ లో మరో 10 మంది కంటిస్టెంట్స్ ఉంటారట. టాస్క్ ల సమయంలో కంటిస్టెంట్స్ ఆ హౌస్ నుంచి ఈ హౌస్ కు షిఫ్ట్ అవుతూ ఉంటారట. అలాగే వీకెండ్ ఎపిసోడ్స్ కూడా గతంలో కంటే బిన్నంగా ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది. దీన్ని బట్టి చూస్తే ఈసారి సీజన్ రసవత్తరంగానే ఉండబోతుందనిపిస్తోంది. మరీ ఈ సరికొత్త కాసెప్ట్ తో రాబోతున్న బిగ్ బాస్ షో ను ప్రేక్షకులు ఎంతమాత్రం ఆదరిస్తారో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు