Gunturu kaaram latest update: గుంటూరు కారం ను చుట్టేస్తున్నారా ?

Gunturu kaaram latest update:

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న గుంటూరు కారం సినిమా గురించి అందరికి తెలిసిందే. ఇటీవల కాలంలో పలు వివాదాల నడుమ నిత్యం వార్తల్లో ఉంటున్న ఈ సినిమా గురించి లేటెస్ట్ గా మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శర వేగంగా జరుగుతుంది. గత కొద్దీ రోజుల క్రితం వరకు మహేష్ బాబు వెకేషన్ కు వెళ్లిన కారణంగా షూటింగ్ నిలిచిపోయిన ఈ సినిమా ఇటీవలనే మళ్ళీ మొదలైంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ షెడ్యూల్ షూటింగ్ ను ఇటీవలనే స్టార్ట్ చేసారు మేకర్స్.

అయితే దాదాపు 10 రోజుల పాటు గుంటూరు కారం సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ షూట్ చేయవలసి ఉండిందట. దీనికి సంబంధించి పదిరోజుల పాటు షూటింగ్ ప్రణాళిక అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారట యూనిట్. అయితే అనుకున్నట్టుగానే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారట కానీ మళ్ళీ ఏమైందో తెలియదు గాని 10 రోజుల పాటు జరగవలసి ఉన్న ఈ సినిమా క్లైమాక్స్ షెడ్యూల్ షూటింగ్ ను కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేసారని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది.

- Advertisement -

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన రెండు షెడ్యూల్స్ షూటింగ్స్ కూడా అనుకున్న టైం కంటే ఒకటి, రెండు రోజుల ముందే షూటింగ్ ఫినిష్ చేశారట. దాంతో ఈ సినిమాపై అందరికి అనుమానాలు వస్తున్నాయి. ముందు నుంచి గుంటూరు కారం సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ చెబుతుండటంతో.. ఆ టైం కు ఎలాగైనా రిలీజ్ చేయాలని, అనుకున్న దానికంటే ముందే షూటింగ్ ఫినిష్ చేయాలనే ఆత్రుతతో ఈ సినిమా పూర్తి చేయడానికి చూస్తున్నారని సమాచారం అందుతోంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమాకు ప్రేక్షకులలో తీవ్రంగా నెగిటివిటి ఉండటంతో ఈ లేటెస్ట్ రూమర్స్ మహేష్ ఫ్యాన్స్ ను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు