Mahesh’s Guntur Kaaram: గుంటూరు కారంలో హైలైట్ ఏంటంటే..!

Mahesh’s Guntur Kaaram

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చాలా కాలం కిందట షూటింగ్ మొదలైనప్పటికీ ఈ సినిమా వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ డిలే అవుతూ వస్తోంది.మొత్తానికి అవాంతరాలను దాటుకొని  ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అవ్వటంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో హోప్స్ పెరిగాయి.

అంతే కాకుండా ఇటీవల ఓ కార్పొరేట్ ఈవెంట్ లో పాల్గొన్న మహేష్ బాబు సినిమా సంక్రాంతికి కచ్చితంగా రిలీజ్ అవుతుందని హామీ ఇవ్వటంతో సినిమాపై నెలకొన్న అనుమానాలన్నీ క్లియర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా గురించి మరొక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈ సినిమాలో విలన్లు హీరోయిన్ శ్రీలీలను కిడ్నాప్ చేసే సీన్ ఉంటుందని, ఆ సీన్లో హీరో విలన్ల దగ్గర నుండి హీరోయిన్ ని కాపాడే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఈ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యిందని, ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ లు ఈ సీక్వెన్స్ ని నెక్స్ట్ లెవెల్ లో అటు ఫ్యాన్స్ కి, ఇటు మాస్ ఆడియెన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా ప్లాన్ చేశారని సమాచారం.

- Advertisement -

మొదటి నుండి ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ అండ్ డైలాగ్ మాడ్యులేషన్ తో కనిపిస్తాడని వార్తలొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉంది. మహేష్ ఫ్యాన్స్ మొదటి నుండి ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఈ సినిమా ఇప్పుడైనా వాయిదా పడకుండా షూటింగ్ కంప్లీట్ అయ్యి అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు