Unstoppable: బాలయ్య షో కి గ్లామర్ టచ్.. ప్రోమో మామూలుగా లేదు..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఆరు పదుల వయసులో కూడా వరుస విజయాలను అందుకుంటూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న బాలకృష్ణ అలియాస్ బాలయ్య గత కొన్ని నెలలుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే షోకి హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు బుల్లితెర టిఆర్పి రేటింగ్ లో కూడా నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా తనదైన మార్క్ హోస్టింగు తో రక్తి కట్టిస్తున్నారు బాలయ్య.. ఇక ప్రస్తుతం సీజన్ లిమిటెడ్ ఎడిషన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సీజన్ కూడా అసలు తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది.

ఇప్పటికే తొలి రెండు ఎపిసోడ్లు సూపర్ హిట్ కాగా తాజాగా మూడో ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సీనియర్ హీరోయిన్ సుహాసిని , శ్రియా, సీనియర్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ, హరీష్ శంకర్ తో బాలయ్య సందడి మామూలుగా లేదు. ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీ వేదికగా డిసెంబర్ 22వ తేదీన స్ట్రీమింగ్ కి రానుంది. ఇకపోతే ఈ షో కి గ్లామర్ టచ్ మరింత కన్నుల పండుగగా ఉందని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా బాలయ్య, సుహాసినిది సూపర్ హిట్ కాంబినేషన్.. వీరిద్దరూ అప్పట్లో చాలా సినిమాలలో నటించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. మరోపక్క బాలయ్య బాబు , శ్రియ కూడా సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో పైసా వసూల్, చెన్నకేశవరెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సినిమాలు వచ్చాయి. ఇక ఈ సినిమాలలో వీరిద్దరికి మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు.

- Advertisement -

ఇక మరొకవైపు లక్ష్మీనరసింహ వంటి బ్లాక్ బస్టర్ అందించిన జయంత్ సి పరాన్జి కూడా బాలయ్య షో కి వచ్చారు. మరొకవైపు కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా లెజెండ్తో ఆటలు ఆడడానికి సిద్ధమయ్యారని చెప్పవచ్చు. సాధారణంగా బాలయ్య.. వచ్చే అతిధులను ప్రశ్నలు వేసి ఇరుకును పెట్టేస్తారు.. కానీ మూడో ఎపిసోడ్లో మాత్రం వచ్చిన అతిథులే బాలయ్యను ప్రశ్నలతో ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రోమో వచ్చిన అతిథులతో చాలా సందడిగా సాగింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు