Adipurush: ఆ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయినట్లేనా..?

దేశమంతా ఇప్పుడు ఆదిపురుష్ యుఫోరియాలో ఉంది, ఏ ఒక్కరిని కదిపినా ఈ సినిమా గురించే ప్రస్తావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షోతోనే మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. రిలీజ్ కి ముందు ఎంత హైప్ అయితే క్రియేట్ అయ్యిందో ఇప్పుడు సోషల్ మీడియాలో అదే రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతోంది ఆదిపురుష్. భారతీయ సినిమా చరిత్రలో రామాయణం ఆధారంగా రూపొందిన ఏ సినిమాకు కూడా ఇంతటి స్థాయిలో నెగిటివిటి రాలేదంటే అతిశయోక్తి కాదు. మిక్స్డ్ టాక్ రావటానికి కారణం దర్శకుడు ఓం రౌత్ నిర్లక్ష్యమే అని మెజారిటీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా, ఆదిపురుష్ వెనక పొలిటికల్ మాఫియా ఉండటమే కారణం అని మరికొందరి అభిప్రాయం.

ఆదిపురుష్ సినిమా విషయంలో క్రియేట్ అయిన హైప్ చూస్తే సినిమాపై ఒక రాజకీయ పార్టీ ప్రభావం ఉందన్నది నిజమేనేమో అన్న అనుమానం కలుగుతోంది. రిలీజ్ కి వారం ముందు తిరుపతిలో జరిగిన ప్రీరిలీజ్ ఫంక్షన్ కి ఇండస్ట్రీ నుండి సెలబ్రిటీలు ఎవరూ రాకుండా పీఠాధిపతి చిన్నజీయర్ స్వామి హాజరు కావడం, ఆ తర్వాత ప్రముఖులంతా వరుస పెట్టి పెద్ద మొత్తంలో సినిమా టికెట్స్ కొని అనాధాశ్రమాలకి డొనేట్ చేయడం, సినిమా ప్రదర్శిస్తున్న ప్రతి థియేటర్లో హనుమంతుడికి ఒక సీట్ కేటాయించటం వంటి సంఘటనలు కూడా పలు అనుమానాలకు దారి తెస్తుంది. ఈ సినిమా ద్వారా తమ ఎజెండాని జనాల్లోకి తీసుకెళ్లాలన్న సదరు పార్టీ ప్లాన్ వర్కౌట్ కాలేదని మొదటి ఆటతోనే స్పష్టం అయ్యింది.

మొత్తానికి వెండితెరపై హృద్యమైన దృశ్యకావ్యంగా ఉండాల్సిన రామాయణాన్ని తమ స్వలాభం కోసం రావణుడి రూపంలో ఒక మతానికి నెగిటివిటి వచ్చేలా చేయాలని ప్రయత్నం చేసి హిందూ ధర్మానికి మచ్చ తెచ్చేలా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాలు చేసి లాభపడే ట్రెండ్ ఇప్పుడు మొదలైంది కానప్పటికీ, రామాయణాన్ని కూడా వదలని పైత్యం ఏ మాత్రం హర్షణీయం కాదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు