Abhiram: ‘అహింస’కు అన్నీ అపశకునాలే..!

సీనియర్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్న సినిమా అహింస. జూన్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు అంతగా బజ్ క్రియేట్ కాలేదు. అహింస సినిమా రిలీజ్ అవుతున్న రోజునే రిలీజ్ అవుతున్న పరేషాన్ సినిమా ప్రమోషన్స్ పాల్గొంటున్న రానా తన తమ్ముడి సినిమాని ప్రమోట్ చేయకుండా బయటి సినిమాను ప్రమోట్ చేయటం ఒక కారణం అయితే, దర్శకుడు తేజ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, ఈ సినిమా అభిరామ్ కోసం చేయలేదని, కేవలం రామానాయుడికి ఇచ్చిన మాట కోసమే చేశానని చెప్పటం సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సినిమాలో విషయమేమీ లేకున్నా కూడా ప్రమోషన్స్ ఊదరగొట్టి జనాన్ని థియేటర్ వైపు ఆకర్షిస్తున్న ఈ రోజుల్లో తేజ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరో పక్క మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసాడు. ఈపాటి నుండో ఉన్న గిల్ట్ ఫీలింగ్ కారణంగానే ఈ సినిమాకు సంగీతం అందించానని చెప్పుకొచ్చాడు ఆర్పీ. తను సంగీతం మానేసి డైరెక్షన్, యాక్టింగ్ మొదలు పెట్టిన నాటి నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎక్కడ కనిపించినా మళ్ళీ మ్యూజిక్ ఎప్పుడు చేస్తావని అడిగేవారని, ఆయన అడిగిన ప్రశ్నకు అప్పుడు, ఇప్పుడు అని సమాధానం ఇచ్చి తప్పించుకునే వాడినని చెప్పిన ఆర్పీ, ఆయన చనిపోయాక ఆ మహానుభావుడి కోరిక తీర్చలేకపోయా అన్న గిల్టీ ఫీలింగ్ ఉండేదని అన్నారు. అందుకే మ్యూజిక్ చేస్తానని డైరెక్టర్ తేజని సంప్రదించగా ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చాడని అన్నారు.

ఈ సినిమాకు ముందు చాలా సినిమాలకు మ్యూజిక్ చేయమని తనకు ఆఫర్లు వచ్చాయని, కథలు నచ్చక ఏ సినిమా ఒప్పుకోలేదని అన్నారు. ఆ రకంగా, అహింస సినిమాకు ప్రమోషన్స్ వల్ల బజ్ క్రియేట్ అవ్వాల్సింది పోయి ఇలా నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఒక లెజెండరీ నిర్మాత మనవడు, బడా ప్రొడ్యూసర్ కొడుకు, టాలీవుడ్ స్టార్ హీరో అన్న కొడుకు, యంగ్ హీరో తమ్ముడు అంటూ ఇన్ని ట్యాగ్స్ ఉన్న అభిరామ్ డెబ్యూ సినిమాకి ఉండాల్సిన హైప్ అహింస సినిమాకి ఏ మాత్రం లేదని చెప్పాలి. మరి, మినిమమ్ బజ్ కూడా క్రియేట్ చేయలేని ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు