తమిళ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రజినీకాంత్ 169వ సినిమా ఇది. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ సరికొత్త అవతారంలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రజనీకాంత్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీతో పాటు ఐశ్వర్యరాయ్, కె ఎస్ రవికుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జైలర్ సెట్స్ నుంచి సునీల్ లుక్ ను మేకర్స్ లాంచ్ చేశారు.
ఈ లుక్ ను సునీల్ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ లో నేను, ఇలాంటి అద్భుతమైన పాత్ర ఇచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్,సన్ పిక్చర్స్,రజనీకాంత్ కు ధన్యవాదాలు అంటూ ట్విట్ చేశాడు సునీల్.
ఇక ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా నుండి ఓ స్టార్ హీరోయిన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మిల్కీ బ్యూటీ తమన్నా జైలర్ మూవీలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఆమె ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందా అనే విషయాన్ని మాత్రం చిత్ర యూనిట్ రివిల్ చేయలేదు.
ఇక మరికొంతమంది స్టార్స్ కు సంబంధించిన పోస్టర్స్ ను కూడా ఇదేవిధంగా రివిల్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News