Rahul Ravindran : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన డైరెక్టర్… అసలేమైంది?

రాహుల్ రవీంద్రన్ ఏంటి ఇలా మారిపోయాడు? అసలు ఈ డైరెక్టర్ కి ఏమైంది? తాజాగా ఆయనను చూసిన వారందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. నటుడిగా, దర్శకుడిగా టాలీవుడ్ కు సుపరిచితుడైన రాహుల్ రవీంద్రన్ కొత్త లుక్ అందరికి షాక్ ఇస్తోంది.

‘అందాల రాక్షసి’ వంటి పలు సినిమాల్లో నటించి హీరోగా మెప్పించాడు రాహుల్. ఆ తరువాత హీరోగా చేయడంతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కన్పిస్తూ వస్తున్నాడు. కానీ ఆయన ఫోకస్ అంతా దర్శకత్వంపై ఉండడంతో “చిలసౌ” మూవీతో డైరెక్టర్ గా మారాడు. నటుడిగా, దర్శకుడిగా తనలోని మల్టీ ట్యాలెంట్ ను బయట పెడుతున్నాడు. మొదటి మూవీ “చిలసౌ” తోనే దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ఆ తరువాత కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా “మన్మథుడు” అనే మూవీ చేశాడు. కానీ ఆ ప్రయత్నం రాహుల్ ని నిరాశ పరిచింది. తాజాగా రాహుల్ దర్శకుడిగా మరో మూవీ బాధ్యతలు చేపట్టాడు. ముచ్చటగా మూడో సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’తో మార్ ప్రయోగాత్మక చిత్రం చేయడానికి సిద్ధం అయ్యాడు.

తాజాగా ఈ మూవీ లాంచ్ జరిగింది. ది గర్ల్‌ఫ్రెండ్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న “ది గర్ల్ ఫ్రెండ్” మూవీని నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా లాంచ్ చేశారు. ఈ వేడుకలో రాహుల్ రవీంద్రన్ నెరిసిన జుట్టు, గడ్డంతో విచిత్రంగా కన్పించి అందరికీ షాక్ ఇచ్చాడు. ముసలి వాళ్ళు సైతం యంగ్ గా కనిపించడానికి ప్రయత్నిస్తున్న ఈరోజుల్లో ఇంత యంగ్ ఏజ్ లో రాహుల్ ముసలాడిలా తెల్లటి గడ్డం, జుట్టుకు మాత్రం రంగేసి కన్పించడం గమనార్హం. అయితే ఈ హీరో “గుంటూరు కారం” మూవీలో ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. మరి ఆ సినిమా కోసం ఏమైనా ఇలాంటి మేకోవర్ ను ట్రై చేశారా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

- Advertisement -

ఏదేమైనా నటులు లేదా డైరెక్టర్ ఎవరైనా కెమెరా ముందు చిన్న ఏజ్ లోనే ముసలాడిలా కన్పించాడు ఇష్టపడరు. మరి రాహుల్ మాత్రం తన నెగ్లెజెన్స్ తో ఇలా కన్పించాడా? లేకపోతే ఏదైనా సినిమా కోసం ఈ లుక్కా? ట్రెండీగా ఉంటుందని ఇలా చేసాడో తెలీదుగానీ ఆయన లుక్ పై మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు