Vijay Nirmala: విజయ్ నిర్మల ఆస్తి మొత్తం నరేష్ కి కాదా..ఇదెక్కడి ట్విస్ట్.!

దివంగత నటీమణి , దర్శకురాలు విజయ్ నిర్మల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దర్శకురాలిగా, నటిగా ఎన్నో కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించింది. ఇకపోతే విజయ్ నిర్మల వారసుడు ఎవరు అంటే వెంటనే నరేష్ గుర్తుకు వస్తారు.. తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా మరింత పేరు దక్కించుకున్న విజయ్ నిర్మల మహిళా దర్శకురాలిగా 44 సినిమాలను తెరకెక్కించి.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్నారు. 2019లో మన నుంచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన ఈమె రెండుసార్లు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి వివాహం జరిగిన తర్వాత సీనియర్ హీరో నరేష్ కి జన్మనిచ్చిన ఈమె.. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ను వివాహం చేసుకున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ తో ఈమెకు ఎలాంటి సంతానం కలగలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె మరణాంతరం ఆమె ఆస్తి మొత్తాన్ని నరేష్ కే ఇచ్చారా? అన్న ప్రశ్న ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇకపోతే ఆమె ఆస్తి పంపకాలను చేద్దామనుకున్నప్పుడు నరేష్ తో పాటు మరో హీరోకి కూడా తన ఆస్తిలో సగభాగం ఇవ్వాలనుకున్నారట.

అయితే ఇంతకు ఆ హీరో ఎవరు అంటే? అతను ఎవరో కాదు. నరేష్ పెద్ద కొడుకు నవీన్.. ఇదివరకే నవీన్ రెండు మూడు చిత్రాలలో హీరోగా నటించి.. ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. కానీ పెద్దగా ప్రేక్షకులకు తెలియదనే చెప్పాలి..ఇక విజయ్ నిర్మల తన ఆస్తిని పంచుదామని అనుకున్నప్పుడు సగభాగం నరేష్ కి అలాగే సగభాగం తన మనవడైన నవీన్ కి ఇవ్వాలని అనుకున్నారట.

- Advertisement -

అయితే ఆ సమయంలో నవీన్ కి ఆస్తులపై పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల ఆస్తి మొత్తాన్ని తండ్రి నరేష్ పేరు పైన రాయమని చెప్పారట. అలా రూ .1000 కోట్ల వరకు ఆస్తులను నరేష్ పైనే రాసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని నవీన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇకపోతే నరేష్ కి ముగ్గురు భార్యలు.. ముగ్గురు కొడుకులు కాగా.. మొదటి భార్య కొడుకు నవీన్.. రెండవ భార్య కొడుకు రణధీర్.. మూడో భార్య కొడుకు తేజ.. ఇక నరేష్ ఆస్తుల విషయంలో ఈ ముగ్గురు కొడుకుల మధ్య ఎప్పుడూ చర్చ రాలేదని..

ముగ్గురికి కూడా ఒకరంటే ఒకరు చాలా ఇష్టం అని కూడా గతంలో నవీన్ తెలిపారు. ఇక మొత్తానికైతే నరేష్ సంపాదించిన ఆస్తితో పాటు తన తల్లి విజయనిర్మల సంపాదించిన ఆస్తులను కూడా ఈ ముగ్గురు పిల్లలు సమానంగా పంచుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు