Tollywood: ట్రెండ్ సెట్టింగ్ ఫిలిమ్స్ ఇన్ టాలీవుడ్

ఎప్పుడూ జరిగే దానిని అనుభవం అంటారు. ఎప్పుడో జరిగేదాన్ని అద్భుతం అంటారు. అలాంటి అద్భుతాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ సార్లు మాత్రమే జరుగుతాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాదాపుగా ఇప్పుడు కొన్ని వేలకు పైగా సినిమాలు వచ్చినా కూడా కొన్ని మాత్రమే ఎప్పటికీ ప్రేక్షకులు గుండెల్లో పదిలంగా గుర్తుండిపోతాయి. అలా ఈ జనరేషన్ కి ట్రెండ్ సెట్టింగ్ చేసిన సినిమాలు గురించి మాట్లాడుకుంటే అందరికీ ఫస్ట్ గా గుర్తొచ్చే సినిమా శివ.

రామ్ గోపాల్ వర్మ – శివ
శివ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే శివ సినిమా అంత ఎక్కువగా మాట్లాడింది. శివ సినిమా అప్పటివరకు మూస దోరణిలో సాగుతున్న తెలుగు సినిమా పంథాను మార్చింది. మెల్లగా నడుస్తున్న తెలుగు సినిమా శివ తో పరుగులు పెట్టింది. శివ సినిమా టేకింగ్, ఆ సౌండ్ డిజైన్ ఇవన్నీ కూడా అప్పటి ఆడియన్స్ కి కొత్తగా అనిపించాయి. చాలామందిని ఇంపాక్ట్ చేసింది శివ సినిమా. శివ సినిమా చూసిన తర్వాత చాలామంది దర్శకులు వాళ్ళు అప్పటివరకు రాసుకున్న స్క్రిప్ట్లను చింపేశారు అంటే అంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది శివ సినిమా. శివ సినిమా చూసిన తర్వాత కొంతమంది విజయవాడలో చైన్లు పట్టుకుని కూడా తిరిగేవారు అని చెప్పుకుంటారు. అది శివ సినిమా క్రియేట్ చేసిన ట్రెండ్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – ఖుషి
తెలుగు ప్రేక్షకులకు ఖుషి సినిమా ఆల్ టైం ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూపించిన విధానం. భూమికా, పవన్ కళ్యాణ్ మధ్య కెమిస్ట్రీ. ఆ సినిమా మ్యూజిక్. ఆ సినిమా కథ. ఇవన్నీ కూడా వేరే లెవెల్లో అనిపించాయి. ఎస్ జె సూర్య ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. వాస్తవానికి ఈ ఖుషి సినిమా అనేది తమిళ్ ఖుషి కి రీమేక్ గా తెరకెక్కింది. కానీ ఒరిజినల్ కంటే కూడా ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి కారణం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయిన విధానం. కేవలం యాక్టర్ గానే కాకుండా టెక్నీషియన్ గా కూడా కొన్ని ఫైట్స్ ని కొరియోగ్రఫీ చేయడం. కొన్ని సాంగ్స్ ను కొరియోగ్రఫీ చేయడం. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బ్యూటీని తీసుకొచ్చాయి ఖుషి సినిమాకి.

- Advertisement -

సందీప్ రెడ్డి వంగ – అర్జున్ రెడ్డి
అర్జున్ రెడ్డి, ఈ సినిమా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 2017 ఆగస్టు 25న రిలీజ్ అయిన ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. అప్పట్లో తెలుగు సినిమా శివకు ముందు శివ తర్వాత అని మాట్లాడినట్టు, అర్జున్ రెడ్డి సినిమా కూడా అదే ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. అప్పటివరకు వస్తున్న సినిమాలు అన్నిటికంటే కూడా అర్జున్ రెడ్డి సినిమా ఒక మెట్టు పై స్థాయిలో కూర్చుంది. ఒక మామూలు హీరో ఒక కొత్త డైరెక్టర్ కలిసి సంచలనం సృష్టించి చాలామందిని కెలికేసారు. ఆ రోజుల్లో అర్జున్ రెడ్డి చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఒకే సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సంచలనం సృష్టించాడు సందీప్ రెడ్డి వంగ. ఇలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు ఇన్స్టెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలు ఉన్నాయి.

త్రివిక్రమ్ చెప్పినట్లు అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగిపోయిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదన్నట్టు ఈ మూడు సినిమాలు ఒక అద్భుతాలు అని చెప్పొచ్చు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు