Salaar 2 days Colletions : రెండ్రోజుల్లోనే నిర్మాతలు సేఫ్… ఎన్ని వందల కోట్లు వచ్చాయంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల ఊచకోత కోస్తోంది. రెండు రోజుల్లోనే ఈ మూవీ నిర్మాతలను సేఫ్ అని ఫీల్ అయ్యేలా చేసింది. మరి ఈ రెండు రోజుల్లో “సలార్” మూవీ ఎన్ని వందల కోట్లు రాబట్టింది అంటే…

సరైన సంఖ్యలో థియేటర్లు దొరకపోయినా, అనుకున్న రేంజ్ లో షోలు పడకపోయినా “సలార్” రికార్డులు తిరగరాస్తోంది. రిలీజ్ అయిన ఫస్ట్ రోజే 175 కోట్లను కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. కావల్సినన్ని థియేటర్లలో రిలీజ్ కాకపోయినా 2023లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా మొదటి స్థానంలో నిలిచి, అప్పటిదాకా ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది. ఇక రెండవ రోజు కూడా “సలార్” మూవీ కలెక్షన్ల పరంగా దుమ్ము లేపింది. ఈ మూవీ రెండు రోజుల్లోనే 296.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. 300 కోట్లకు అతి దగ్గరగా వచ్చి ఆగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా “సలార్” మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. “సలార్” ఇదే జోష్ తో బాక్స్ ఆఫీస్ ను ఊపేస్తే వారంలోపే 1000 కోట్లు కొల్లగొట్టి మరో రికార్డు క్రియేట్ చేయడం ఖాయం.

నిజానికి “సలార్” మూవీకి నార్త్ లో థియేటర్ల సమస్య ఎదురైన విషయం తెలిసిందే. అక్కడ అనుకున్నంతగా షోలు పడనేలేదు. నైజాంలోను ఇదే పరిస్థితి ఎదురైంది. “ఆర్ఆర్ఆర్” మూవీ రేంజ్ లో థియేటర్లు దక్కకపోవడం, బరిలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన “డంకీ” మూవీ కూడా ఉండడంతో “సలార్” ఆల్ టైం రికార్డ్ లను మిస్ అయ్యాడు. కానీ అంతా అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఇప్పటిదాకా ఉన్న రికార్డులన్నీ బద్దలు అయ్యేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

ఇక ప్రస్తుతం వీకెండ్ తోపాటు క్రిస్మస్ హాలిడే కూడా కలిసి రావడంతో “సలార్” మూవీ సోమవారం భారీ ఎత్తున వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేవలం రెండ్రోజుల్లోనే సినిమాకు పెట్టిన బడ్జెట్ మొత్తం వెనక్కి వచ్చిందని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఫుల్ రన్ లో ఈ మూవీ 1000 కోట్ల మార్కును దాటడం ఖాయమని డార్లింగ్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యి ప్రభాస్ తో పాటు అతని అభిమానుల్ని సైతం నిరాశపరిచాయి. కానీ చాలా కాలం ఎదురుచూపుల తర్వాత “సలార్” మూవీలో ప్రభాస్ కటౌట్ ను అనుకున్న విధంగా చూడడంతో విందు భోజనం తిన్నంత ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మరి ముందు ముందు ఈ మూవీ వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన “సలార్” మూవీ డిసెంబర్ 22న రిలీజ్ అయింది. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించగా, శ్రియ రెడ్డి కీలక పాత్రను పోషించింది. శ్రియ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు