Vijay Devarakonda : అందుకు అభ్యంతరం లేదు

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “లైగర్” చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది మూవీ యూనిట్. విజయ్ దేవరకొండ, అనన్య పాండే పలు ప్రాంతాలలో చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే తాజాగా నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ సీజన్ 7 లో వీరిద్దరూ పాల్గొన్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ ఇటీవలే మొదలైంది.

ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో టీవీలో మాత్రమే ప్రసారం అయ్యే ఈ షో, ఇప్పుడు కేవలం ఓటీటీ లోనే అందుబాటులో ఉంది. ఈ సీజన్ లో ఇప్పటికే మూడు ఎపిసోడ్ లు పూర్తవగా, నాలుగో ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే గెస్ట్ గా వచ్చారు. ఇందులో విజయ్, అనన్య చాలా విషయాలు షేర్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలకు విజయ్ దేవరకొండ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. నేషనల్ క్రష్ రష్మిక తో ప్రేమలో ఉన్నారా అంటూ అడిగిన ప్రశ్నకు.. తాము మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశాడు విజయ్.

అయితే ఇటీవల బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోలతో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో విజయ్ దేవరకొండను ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు న్యూడ్ గా ఫోజ్ ఇస్తావా అని కరణ్ జోహార్ అడిగారు. దానికి విజయ్ దేవరకొండ బాగా తీస్తే న్యూడ్ గా ఫోజులు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. అటు అనన్యను కూడా కరణ్ ఇలాంటి ప్రశ్నలే వేశాడు. విజయ్ ను న్యూడ్ గా చూడాలని అనుకుంటున్నావా అని అడిగితే, లైగర్ లోనే చాలా వరకు చూశాను అంటూ అనన్య చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు