Ahimsa : టీజర్ కు డేట్ ఫిక్స్

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న కొత్త హీరో అభిరామ్. రానా తమ్ముడు అయినా అభిరామ్ ఇప్పటికే వెండితెర ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు తేజ దర్శకత్వంలో అభిరామ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కి ముహూర్తం ఖరారు అయింది. క్రియేటివ్ డైరెక్టర్ తేజ, అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘అహింస’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఈ ఏడాది చివరి నాటికి సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇటీవల విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా మేకర్స్ మరో అప్ డేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా టీజర్ డేట్ ను చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. అహింస టీజర్ ను దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ప్రేమ కథలను విభిన్నంగా తెరకెక్కించడంలో తేజ సుప్రసిద్ధుడు. ఈ క్రమంలోనే ఈ చిత్రంతో మరో కొత్త తరహా ప్రేమ కథను చూపించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో అభిరామ్ కు జోడిగా గీతిక తివారి హీరోయిన్ గా నటించింది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆర్.పి పట్నాయక్ సంగీతం అందించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు