20 Years For Venky : ఇప్పుడు అందరి చూపు సీక్వెల్‌పైనే…

20 Years For Venky : కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు సరైన ఆదరణను దక్కించుకోవు. రిలీజ్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సినిమాలు బీభత్సమైన హిట్లు కూడా అవుతుంటాయి. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పరిస్థితులు, అప్పటి ప్రేక్షకుల మైండ్ సెట్ వలన ఆ సినిమాలు వర్కౌట్ కాకపోవచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సినిమాలను చూసినప్పుడు అరె ఇంత గొప్ప సినిమాని ఆ రోజుల్లో హిట్ చేయలేకపోయామా అంటూ ఫీలైన సందర్భాలు కూడా ఉంటాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అలాంటి సినిమాలు గురించి చెప్పడానికి ఉదాహరణలు వందల్లో ఉంటాయి.

ఇకపోతే ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అండి శ్రీను వైట్ల అని చెప్పొచ్చు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దర్శకులకి దక్కని అదృష్టం శ్రీను వైట్లకి దక్కింది. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ హీరోస్ తో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి ఈ తరం స్టార్ హీరోలతో కూడా పనిచేసే అవకాశం దక్కిన ఏకైక డైరెక్టర్ శ్రీనువైట్ల. ఇకపోతే శ్రీనువైట్ల ఎన్ని సినిమాలు చేసినా కూడా వెంకీ సినిమా ప్రత్యేకమని చెప్పొచ్చు.

ముఖ్యంగా వెంకీ సినిమాలో చాలా విషయాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వెంకీ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కూడా ఒక సెపరేట్ యూనిక్ స్టైల్ ఉంటుంది. అప్పుడున్న టెక్నాలజీతో చేసిన ట్రైన్ సీక్వెన్స్ మొత్తం ఇప్పటికీ ఒక కల్ట్ స్టేటస్ కలిగి ఉంటుంది. చాలామంది ఈ ట్రైన్ సీక్వెన్స్ గురించి చెప్పినప్పుడు ఇది చాలా ఎక్కువగా ఉంది దీని డ్యూరేషన్ తగ్గిద్దామని శ్రీనువైట్లకి చెప్పారు. కానీ శ్రీను వైట్ల దానిని వినకుండా అలానే ఉంచారు. ఆ సీక్వెన్స్ విపరీతమైన ఫన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ చాలామంది ఆ సీక్వెన్స్ ను ఎంజాయ్ చేస్తారు.

- Advertisement -

ఇక వెంకి సినిమా కథ విషయానికి వస్తే వైజాగ్ సీతంపేట కు చెందిన వెంకటేశ్వర్లు తన ఫ్రెండ్స్ తో పాటు ఊర్లో అప్పులు చేస్తూ తాగుతూ తిరుగుతూ ఉంటారు. అలానే జాతకాలను విపరీతంగా నమ్ముతూ ఉంటాడు. ఏ పని మొదలుపెట్టినా కూడా జగదాంబ చౌదరి సంప్రదిస్తుండడం వెంకీకి అలవాటు. అయితే ఒక ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఒకరి చేతిలో మోసపోయిన వెంకీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోకుండా పోలీస్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అయిపోతారు. సెలక్షన్స్ కోసం హైదరాబాద్ వెళుతుండగా ఆ రాత్రి ట్రైన్ లో ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. అదే ట్రైన్లో శ్రావణి అనే అమ్మాయి కూడా పరిచయం అవుతుంది. ఆ జరిగిన సంఘటన ఏంటి.? శ్రావణి కి వెంకీకి మధ్య పరిచయం ప్రేమగా మారి అది ఎన్ని మలుపులు తిరిగింది అనేది ఈ కథ.

ఒక మామూలు కథని శ్రీను వైట్ల డిజైన్ చేసిన విధానం అద్భుతం అనిపిస్తుంది. ఇప్పటికీ చాలామంది యూత్ ఈ సినిమాను మ్యూట్ లో పెట్టిన డైలాగులు చెప్పే అంత క్రేజీగా ఉంటాయి. ఈ సినిమాలో శ్రీను వైట్ల డిజైన్ చేసిన క్యారెక్టర్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. బొక్క సుబ్రహ్మణ్యం, గజాల ఫ్రం వాషింగ్టన్ డిసి ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న చాలా మీమ్ కంటెంట్ అంతా కూడా ఈ సినిమా నుంచి తీసుకున్నదే. ఇకపోతే ఈ సినిమాను రీసెంట్ గా కూడా రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ చూసినప్పుడు వెంకీ సినిమాకు సీక్వెల్ రాద్దాం అనే ఆలోచన శ్రీనువైట్లకి వచ్చిందని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు శ్రీనువైట్ల.

తెలుగు సినిమా చరిత్రలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కొన్ని సినిమాలకి వాటి స్థానం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. అలా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న సినిమాలలో వెంకీ సినిమా ఒకటి. ఈ సినిమాను శ్రీను వైట్ల డీల్ చేసిన విధానం. కోన వెంకట్ గోపి మోహన్ వంటి రచయితలు అందించిన మాటలు ఇవన్నీ కూడా ఇప్పటికీ ప్రేక్షకులకు కితకితలు పెడతాయి. వీటన్నిటిని మించి దేవి మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మంచి ప్లస్ అయిందని చెప్పొచ్చు. మొత్తానికి వెంకటేశ్వర్లు తన గ్యాంగ్ తో ట్రైన్ ఎక్కి నేటికీ 20 ఏళ్లయింది ( 20 Years For Venky ).

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు