Srinu Vaitla: సినిమా మేకింగ్ కన్నా మీ మేకింగ్ ఎక్కువైంది

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పలు సక్సెస్ ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీను వైట్ల గత కొన్నేళ్లుగా హిట్ కోసం నానా కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఆయన గత చిత్రాలైన ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు వరుసగా ఒకదానికి మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. దాంతో శ్రీను వైట్ల కెరీర్ కు బ్రేక్ పడింది. సాధారణంగా ఇండస్ట్రీలో ఒకటి, రెండు ఫ్లాప్ లు వస్తానే నిలదొక్కుకోవడం చాలా కష్టం అలాంటింది శ్రీను వైట్లకు ఏకంగా వరుసగా నాలుగు ఫ్లాప్ అవడంతో ఆయన కొద్దీ రోజుల పాటు కనుమరుగైపోయారు.

ఇక లేటెస్ట్ గా చూస్తే ఆయన మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. ఇటీవలనే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరురుకుంటోంది. ఇక ఈ షూటింగ్ కు సంబంధించి ఒక వీడియో బైట్ ను డైరెక్టర్ శ్రీను వైట్ల కాసేపటి క్రితం రిలీజ్ చేసారు. ఇక ఆ వీడియోలో శ్రీను వైట్ల తాము షూట్ చేస్తున్న లొకేషన్ ను చూపిస్తూ కెమెరా ముందు కూర్చొని కాసేపు రాస్తూ, అటు ఇటు తిరుగుతూ దర్శనం ఇచ్చారు.

దాంతో సోషల్ మీడియా అంత ప్రస్తుతం ఆయన రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో ను ట్రోల్ చేస్తూ సినిమా మేకింగ్ కన్నా మీ మేకింగ్ ఎక్కువయ్యిందంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ విధంగా ట్రోల్స్ రావడానికి కారణం లేకపోలేదు. గతంలో శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన బాద్షా సినిమాలో ప్రముఖ ఒక టాలీవుడ్ డైరక్టర్ క్యారెక్టర్ ను రిప్రెసెంట్ చేస్తూ యం యస్ నారాయణ, సత్యం రాజేష్ కాంబినేషన్ లో సీన్ ఉంటుంది. కామెడీ ప్రధానంగా ఉండే ఆ సీన్ బాద్షా సినిమాకే వన్ అఫ్ ది హైలెట్ అని చెప్పొచ్చు.అయితే ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల కూడా ఇంచుమించుగా అదే విధంగా కెమెరా ముందు బిహేవ్ చేయడంతో నెటిజన్లంతా బాద్షా సినిమాలోని ఆ సీన్ ను రిక్రియెట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆయనపై మీమ్స్ వేస్తూ హల్చల్ చేస్తున్నారు. అయితే శ్రీను వైట్ల పై ఉన్న నెగిటివిని మరియు సోషల్ మీడియా ట్రోల్ల్స్ పక్కన పెట్టి చూస్తే మాత్రం గోపీచంద్ సినిమాతో ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి శ్రీను వైట్ల శత విధాల ప్రయత్నం చేస్తునట్టు మాత్రం తెలుస్తుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు