Dasara: “సిల్క్ స్మిత” ఇంకా బతికే ఉంది… ఇదిగో ఫోటోలు

మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత స్టార్ గా ఎదిగిన అందాల తార సిల్క్ స్మిత. మత్తు కళ్ళతో తనదైన అందంతో సిల్క్ అభిమానులను సంపాదించుకుంది. సిల్క్ స్మిత జీవితంలో సినిమాకు మించిన ట్విస్ట్ లు ఉంటాయి. పేద కుటుంబంలో జన్మించిన సిల్క్ స్మితకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేసి పంపించారు. కానీ భర్త వేధింపులు తట్టుకోలేక సిల్క్ స్మిత తన పిన్ని గారి ఇంటికి వెళ్లింది. ఇక తన పిన్నితో కలిసి ఆ తర్వాత మద్రాస్ లో అడుగు పెట్టింది.

అలా వెళ్ళిన సిల్క్ స్మిత మొదట మేకప్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. కాకపోతే దర్శకుడు భార్య కంటపడటంతో సినిమా అవకాశాలను అందుకుంది.ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇది ఇలా ఉండగా, ఇటీవల విడుదలైన దసరా సినిమాలో సిల్క్ స్మిత పోస్టర్ కనిపించడంతో మరోసారి ఆమె జీవితం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా సిల్క్ స్మిత రూపం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అచ్చం తనలాగే ఉన్న ఓ అమ్మాయి మరో సిల్క్ స్మితను గుర్తుచేస్తుంది. ఆమె జూనియర్ సిల్క్ స్మిత అంటున్నారు ఫాన్స్. ఈ అమ్మాయి పేరు విష్ణు ప్రియ. ఫేస్ కట్ మాత్రమే కాదు ఎక్స్ప్రెషన్స్ తో సిల్క్ స్మిత ను గుర్తుచేస్తుంది. ఇక విష్ణు ప్రియ కూడా సిల్క్ స్మిత పాటలకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుండగా, ఆమెను జూనియర్ సిల్క్ స్మిత అంటూ తెగ పొగిడేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు