Prabhas: కల్కి Vs సలార్

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సలార్, ప్రాజెక్ట్ కే సినిమాల టీజర్ లు ఇటీవలనే రిలీజైన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలు ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. సలార్ సినిమానేమో హై ఎండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతుండగా, కల్కి2898 AD సినిమా ఫ్యూచరిస్టిక్ సినిమాగా రూపొందుతుంది. అయితే ఈ రెండు సినిమాలు దేనికవే వైవిద్యభరితమైన సినిమాలైనప్పటికీ ప్రేక్షకుల్లో మాత్రం సలార్ సినిమాపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది.

కెజిఎఫ్ సినిమా ఇండియా వైడ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నింటిని బ్రేక్ చేసి ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా తరువాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ సినిమా చేస్తుండటంతో సినిమా ఎనౌన్స్ చేసినప్పటి నుండే సలార్ కు మంచి బజ్ ఏర్పడింది. ఆ బజ్ వల్లే ఇటీవలనే ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను రిలీజ్ చేయగా రికార్డ్ బ్రేకింగ్ వ్యూవర్షిప్ ను సొంతం చేసుకుంది. తెల్లవారు జామున 5 గంటల సమయంలోఈ రిలీజ్ చేసిన కూడా సలార్ టీజర్ ఎవరు ఊహించని విధంగా ఇప్పటి వరకు  120మిలియన్ల వ్యూవర్షిప్ ను సాధించింది.

ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తోన్న కల్కి2898 AD సినిమా విషయానికొస్తే సలార్ సినిమా కంటే గ్రాండ్ గానే ఈ సినిమా గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసారు. కామిక్-కాన్ లాంటి ఇంటెర్నేషనల్ వేదికపై ఈ సినిమా గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసిన కూడా సలార్ కంటే అతి తక్కువ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంది. కాన్సెప్ట్ పరంగా, క్వాలిటీ పరంగా ఎలా చూసిన కల్కి2898 టాప్ నాచ్ లెవెల్ లో ఉన్న కూడా సలార్ రికార్డ్ ను బ్రేక్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటి వరకు కల్కి2898 గ్లిమ్స్ వీడియో కేవలం 13 మిలియన్ల వ్యూవర్ షిప్ మాత్రమే సాధించింది. దీన్ని బట్టి చూస్తే ప్రేక్షకులు కల్కి2898 కంటే సలార్ కోసమే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు