Varun Tej : మెగా ప్రిన్స్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా జరిగిన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుణ్ తేజ్ తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అన్న విషయాన్ని వెల్లడించారు. గతంలో తాను పెళ్లి చేసుకోబోతున్నాడు అని రూమర్స్ వచ్చిన హీరోయిన్ తన ఫేవరెట్ అని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే?

దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరగని పోరాటం, దేశాన్ని రక్షించడం కోసం వాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో రూపొందుతున్న మూవీ “ఆపరేషన్ వాలెంటైన్”. ఈ సినిమాలో వరుణ్ సరసన 2015లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మానుషి చిల్లర్ హీరోయిన్ గా కనిపించబోతోంది. “ఆపరేషన్ వాలెంటైన్” మూవీతో ఈ బ్యూటీ టాలీవుడ్ లోకి ఎంట్రీస్తోంది. ఇందులో ఆమె రాడార్ ఆఫీసర్ పాత్రలో అలరించబోతోంది. కుశక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్రిప్పింగ్ టీజర్, రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ “వందేమాతరం” సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. మెగా ఫాన్స్ ఎంతో ఎక్సైటింగ్ ఇంకా ఎదురు చూస్తున్న ఈ తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం పలు వాయిదాల అనంతరం మార్చ్ 1న రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు. మరో నెల రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. తాజాగా “ఆపరేషన్ వాలెంటైన్” మూవీ నుంచి రెండో పాటను విడుదల చేశారు.

- Advertisement -

తాజాగా “ఆపరేషన్ వాలెంటైన్” మూవీ నుంచి “గగనాల” అనే రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రత్యేక ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర బృందం. ఈ ఈవెంట్లో విద్యార్థులు అడిగిన పలు ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు వరుణ్ తేజ్ సమాధానం ఇచ్చారు. ఆ క్రమంలోనే వరుణ్ తేజ్ కు “మీరు ఇప్పటిదాకా కలిసి నటించిన హీరోయిన్లలో ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?” అన్న ప్రశ్న ఎదురైంది. దానికి వరుణ్ స్పందిస్తూ తన ఫేవరెట్ హీరోయిన్ లావణ్యను వివాహం చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే తనకు సాయి పల్లవి అంటే కూడా చాలా ఇష్టమని వెల్లడించారు వరుణ్. గతంలో “ఫిదా” సినిమా తర్వాత వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని, సాయి పల్లవి మెగా కాంపౌండ్ లోకి కోడలుగా అడుగుపెట్టబోతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు