Ajay Bhuapathi: ఆర్ఎక్స్ 100″ డైరెక్టర్ ను రిజెక్ట్ చేసిన హీరోయిన్… మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇలా?

 ఆర్ఎక్స్ 100, మహాసముద్రం వంటి ఇంటెన్స్ డ్రామాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు అజయ్ భూపతి, ఇప్పుడు తన మూడవ చిత్రం “మంగళవారం’ మూవీతో టాలీవుడ్ ఆడియన్స్ ను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందాల సుందరి పాయల్ రాజ్‌పుత్ మెయిన్ లీడ్‌గా నటించిన ఈ చిత్రం నవంబర్ 17న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అజయ్ భూపతి విషయంలో గతంలో ఓ హీరోయిన్ ప్రవర్తించిన తీరు, దానిపై తరువాత ఆమె స్పందించిన విధానం, ఈ రెండు ఘటనలపై మన యంగ్ డైరెక్టర్ మరో రకంగా రియాక్ట్ అవ్వడం కొత్త చర్చకు దారి తీసింది.

“ఆర్ఎక్స్ 100” సినిమా తీస్తున్న సమయంలో పాయల్ చేసిన రోల్ కు ముందుగా మరో హీరోయిన్ నందిత శ్వేతను అనుకున్నారట. కానీ ఆమె మాత్రం ఈ మూవీలో బెడ్ రూమ్, లిప్ లాక్ వంటి డీప్ శృంగార సన్నివేశాలు ఉన్నాయనే కారణంతో రిజెక్ట్ చేసిందట. ఇదే విషయాన్ని నందిత స్వయంగా వెల్లడించింది. అయితే ఇదే విషయం గురించి అజయ్ భూపతి మాత్రం తన వెర్షన్ లో మరో రకంగా చెప్పుకొచ్చారు. తాను కొత్త దర్శకుడిని అన్న కారణంతోనే నందిత అప్పట్లో ఆర్ఎక్స్ 100 సినిమాకు రిజెక్ట్ చేసింది అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం.

మరి వీరిద్దరిలో నిజం ఎవరు చెప్తున్నారో తెలియదు కానీ, ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… అజయ్ భూపతి కొత్త చిత్రం ‘మంగళవారం’లో నందిత ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక అప్పట్లో నందిత ‘ఆర్ఎక్స్ 100’ను రిజెక్ట్ చేయడం, ప్రస్తుతం ‘మంగళవారం’ సినిమాలో కీలకపాత్ర చేయడం గమనించిన నెటిజన్లు అప్పుడు అజయ్ మొహం మీదే నో చెప్పి, ఇప్పుడు మాత్రం ఏ మొహం పెట్టుకుని ఆయన సినిమాలో నటిస్తోంది అంటూ నిలదీస్తున్నారు. అంతేకాదు ఇటీవల నందిత హీరోయిన్ గా నటించిన ‘హిడింబ’ మూవీని గుర్తు చేస్తూ ఆ సినిమాలో మాత్రం అంత బోల్డ్ సీన్స్ ఎలా నటించావు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా ఏదేమైనా రిజెక్ట్ చేసిన హీరోయిన్ నే మళ్ళీ తన సినిమాలో ఓ కీలక పాత్ర చేసేలా చేసుకున్న అజయ్ భూపతి ట్యాలెంట్ ను మెచ్చుకుంటున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు