RK Roja Daughter: ఇంట్రడ్యూసింగ్ మంచు లక్ష్మీ సిస్టర్… సరిపోయారు ఇద్దరు!

RK Roja Daughter

మంచు ఫ్యామిలీ. ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కుటుంబం. కానీ, ప్రస్తుతం టాలీవుడ్‌లో వచ్చే ట్రోల్స్‌కు పెద్దన్న పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీలో ఒకరు తక్కువ కాదు.. మరొకరు కాదు. ట్రోల్స్ కంటెంట్ అవ్వడానికి ఆ కుటుంబంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతుంటారు. అందుకు మోహన్ బాబు కూడా తక్కువమేమీ కాదు.

ఇక మంచు లక్మీ గురించి మాట్లాడుకోవాలంటే.. మంచు ఫ్యామిలీకి ఆమె యువరాణి. యువరాణి అంటే ఎక్స్‌ట్రా క్వాలిటీస్ ఉండాలి కదా. అందులోనూ ఈమె తక్కువమేమీ కాదు. ట్రోల్స్ విషయంలో మొత్తం కుటుంబాన్ని డామినేట్ చేసేలా ఉంటుంది.

ఆమె మాట్లాడే ఇంగ్లీష్ కానివ్వండి, స్లాంగ్ కానివ్వండి ఇలా ఏది తీసుకున్న ట్రోల్ కంటెంట్‌గానే ఉంటుంది. అయితే ఇప్పుడు మంచు లక్ష్మీకి పోటీ ఇవ్వడానికి సోషల్ మీడియా ప్రపంచంలోకి మరొకరు ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఎవరో కాదు… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి, నటి రోజా కూతురు అన్షు మాలిక. ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే అన్షు మాలిక సడన్‌గా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? అది కూడా మంచు లక్ష్మీకి పోటీగా… అవును మీరు చదివింది.. వినింది నిజమో. మంచు లక్ష్మీకి పోటీగా ఈ అన్షుమాలిక ఉంటుంది. ఈ విషయం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.

- Advertisement -

ఇటీవల అన్షు మాలిక తన 20 పుట్టిన రోజును జరుపుకుంది. తన బర్త్ డే గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్టు చేస్తూ చెప్పింది. ఈ సమయంలో అన్షు మాలిక వాడిన ఇంగ్లీష్ యాక్సెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు… మీమ్స్ రాయుళ్లకు ఓ కంటెంట్ కూడా దొరికేసింది. మంచు లక్ష్మీకి సిస్టర్ లా ఉంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అంతే కాదు… కొన్ని రోజుల్లోనే మంచు లక్ష్మీకి పోటీ ఇవ్వడమే కాదు, ఆమె దాటేస్తుంది అని కూడా కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ కామెంట్స్ పై నెగిటివిటీ కూడా వస్తుంది. అన్షు మాలిక టాలెంటెడ్ అని, అలాంటి వారిపై ఇలాంటి ట్రోల్స్ చేయడం సరికాదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయినా, మీమ్స్ రాయుళ్లు ఏ మాత్రం తగ్గకుండా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new Bollywood movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు