Rakul : మళ్లీ సౌత్ పై దృష్టి

రకుల్ ప్రీత్ సింగ్.. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోను వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. మహేష్ దగ్గర నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా అందరు హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న రకుల్.. తర్వాత వరుస ప్లాప్స్ తో టాలీవుడ్ కి దూరమైంది. ప్రజెంట్ బాలీవుడ్ మూవీస్ తో బిజీ అయిన రకుల్ ప్రీత్, తాజాగా సౌత్ మీద కూడా కన్నేసే ఉంటుంది.

ఇటీవల విక్రమ్ సినిమాతో సక్సెస్ అందుకున్న కమల్ హాసన్, ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాకు సిద్ధమయ్యాడు. ఈ ఇండియన్ 2 చిత్రంతో రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి దక్షిణాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే కొన్ని సమస్యల కారణంగా ఈ చిత్రం షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది.

ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ, కమల్ హాసన్, శంకర్, కాజల్, రకుల్ ప్రీత్ సహా ఇతర నటీనటులు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టేశారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు కాజల్ అగర్వాల్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రం షూటింగ్ సెట్ లో అడుగుపెట్టిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు