కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్-1′(పి.ఎస్-1) చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి స్టార్లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘మద్రాస్ టాకీస్’ ‘లైకా ప్రొడక్షన్స్’ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కు 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందుతుంది. కాగా, మొదటి భాగం సెప్టెంబర్ 30న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా, ‘పొన్నియన్ సెల్వన్’ రూపొందించాలనే ఆలోచన మణిరత్నంకు ఈ మధ్యన కలిగింది కాదట.
నాలుగు దశాబ్దాలుగా మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. కోలీవుడ్ ఫస్ట్ జనరేషన్ హీరో ఎం.జి.ఆర్ టైం నుండి ఈ కథను తెరకెక్కించాలని ట్రై చేశారట. అటు తర్వాత నాగార్జున, మహేష్ బాబు, విజయ్ లాంటి వారితో కూడా ఈ భారీ ప్రాజెక్టును మొదలుపెట్టాలని భావించారట. కానీ భారీ బడ్జెట్ కావడంతో నిర్మాతలు ముందుకు రాలేదని తెలుస్తోంది.
‘బాహుబలి’ ఇచ్చిన ధైర్యంతో మణిరత్నం ఈ ప్రాజెక్టు మొదలు పెట్టారని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అంతేకాదు ఇన్నేళ్ళలో మణిరత్నం సంపాదించింది చాలా వరకు ఈ చిత్రం కోసం పెట్టేశారని సమాచారం. అయితే, పెద్ద పెద్ద స్టార్లతో ‘పొన్నియన్ సెల్వన్’ రూపొందించాలని మణిరత్నం ఆశపడ్డాడు. కానీ, ప్రస్తుతం సాదా సీదా నటీ నటులతోనే ఈ ప్రాజెక్టును తెరకెక్కించారని స్పష్టమవుతుంది.