Akshay kumar: ఓ మై గాడ్ 2 తెలుగు రీమేక్ పై విమర్శలు

అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి, యామి గౌతమ్ ప్రధాన పాత్రలలో నటించిన హిందీ సినిమా ఓ మై గాడ్ 2. ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ అవశ్యకతను గురించి తెలియజేస్తూ వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా ఒక పక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో పాటు అలాగే విమర్శకుల ప్రశంషలు కూడా అందుకొని మంచి రివ్యూస్ ను సొంతం చేసుకుంది.

అయితే ఇటీవలనే థియేటర్ రన్ ముగించుకున్న ఈ సినిమా కొద్దీ రోజుల క్రితమే ఓటిటిలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఓ మై గాడ్ 2 సినిమా ఇక ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. దాంతో ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తే బాగుంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది.

గతంలో ఓ మై గాడ్ పార్ట్ వన్ ను తెలుగులో గోపాల గోపాల పేరుతో పవన్ కళ్యాణ్, వెంకటేష్ రీమేక్ చేసారు. దాంతో లేటెస్ట్ గా వచ్చిన ఓ మై గాడ్ పార్ట్ 2 కూడా తెలుగులో రీమేక్ చేయాలనే వాదన బలపడింది. అయితే ఈ సినిమా రీమేక్ చేయడానికి వెంకటేష్ మరియు ఇతర సీనియర్ హీరోల అభిమానులు మాత్రం ఈ సినిమా రీమేక్ చేయడానికి మూకుమ్మడిగా నిరసనలు తెలుపుతున్నారు. కారణం ఓ మై గాడ్2 సినిమాలో సెక్స్ గురించిన విషయాలు బాహాటంగా చర్చించటమే అని తెలుస్తుంది. సాధారణంగా తెలుగులో స్టార్ హీరోల సినిమాలంటే.. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమాలు చూస్తారు.

- Advertisement -

కాబట్టి తెలుగు హీరోలు ఇలాంటి సినిమాలు చేస్తే అభిమానులు థియేటర్స్ లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే సోషల్ మీడియాలో సీనియర్ హీరోల అభిమానులు మూకుమ్మడిగా ఓ మై గాడ్ 2 సినిమా రీమేక్ ను వ్యతిరేకిస్తున్నారు. అవసరమైతే డబ్బింగ్ చేయండి అంతేగాని రీమేక్ వద్దని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు