OG Teaser Hidden Deatails: స్క్రిప్టులో వేలు పెడితే గురూజీ హ్యాండ్ తీసేసారా.?

OG Teaser Hidden Deatails

వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోష్ లో ఉన్నారు. ఒక పక్క పాలిటిక్స్ మరోపక్క సినిమాను బ్యాలెన్స్ చేస్తున్నారు. వాస్తవానికి వకీల్ సాబ్ సినిమా తరువాత వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఆనందాన్ని ఇచ్చాయి కానీ, అద్భుతం అనిపించేలా ఒక సినిమా కూడా లేదు.

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమాల్లో ఇప్పటివరకు రిలీజైన ప్రతి సినిమాలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హస్తం ఉంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రీసెంట్ గా “ఓజి” గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బహుశా తన అభిమాన హీరో కావడం వలనో, సుజీత్ ముందు సినిమా తెలుగులో నిరాశ పరచడం వలన తెలియదు కానీ “ఓజి” మాత్రం అరాచకం చూపించాడు సుజీత్.

“ఓజి” గ్లిమ్ప్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ను రిచ్ గా తీర్చిదిద్దాడు సుజీత్.అలానే “we Don’t want thaman” అని ట్రోల్ చేసినవాళ్లకి కూడా థమన్ బాక్గ్రౌండ్ స్కోర్ తో సమాధానం చెప్పాడు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్ వచ్చిన త్రివిక్రమ్ పై విరుచుకుపడే ఒక వర్గపు పవన్ అభిమానులు ఈసారి కూడా అలానే చేసారు. ఇంకొందరు అయితే ట్రోలింగ్ లో పీక్ వెళ్ళి మరి కామెంట్ చేసారు.

- Advertisement -

ఓజి టీజర్ లో ఒక షాట్ లో పవన్ కళ్యాణ్ కూర్చున్నప్పుడు ఆ వెనుక ఎక్వరియంలో కట్ చేసి ఉన్న ఒక హ్యాండ్ ను గమించవచ్చు. దానికి కూడా సుజీత్ కి క్రెడిట్ ఇస్తుంటే, గురూజీ స్క్రిప్ట్ లో వేలు పెట్టాడని హ్యాండ్ తీసేసారు అని కామెంట్స్ మొదలయ్యాయి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు