Miss Shetty Mr Polishetty: ప్రమోషన్స్ అన్నీ ఫెయిల్… ఇక మిగిలింది ట్రైలర్ మాత్రమే!

అనుష్క శెట్టి… సినిమా రంగంలో హీరోయిన్లు అంటే, హీరోల పక్కన ఆడుతూ, పాడుతూ ఉండాలే తప్పా, ప్రత్యేకమైన పాత్రలు అంటూ ఏం ఉండవు అనుకుంటున్న రోజుల్లో, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో హీరోయిన్లకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. నిజానికి అనుష్క శెట్టి కంటే ముందు విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. ఈమె తర్వాత ఆ ప్లేస్ ను భర్తీ చేసింది అనుష్క శెట్టి మాత్రమే.

అలాగే విజయశాంతి చేయాలేని పాత్రలు చేసి చూపించింది. అందుకే విజయశాంతి కంటే ఎక్కువ అభిమానులను అనుష్క శెట్టి సంపాదించుకుంది. వరుస హిట్స్ తో అనుష్క కెరీర్ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో సైజ్ జీరో అనే ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని చేసింది. ఆ మూవీనే అనుష్క కెరీర్ ను స్పాయిల్ చేసింది అని చెప్పొచ్చు.

అయితే చాలా కాలం తర్వాత అనుష్క మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతుంది. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా చేసింది. ఈ మూవీ ఆగస్ట్ 4న విడుదల కాబోతుంది. సినిమా అనౌన్స్ చేసిన తర్వాత, స్వీటీ చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోవడం, అది కూడా యంగ్ హీరోతో జత కట్టడం వాటి వల్ల అంచనాలు భారీగా పెరిగాయి.

- Advertisement -

సినిమా అనౌన్స్ చేసినప్పుడు కనిపించిన హైప్, రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం కనిపించడం లేదు. అంతే కాదు.. మూవీ నుంచి ఓ టీజర్ తో పాటు మూడు సాంగ్స్ వచ్చాయి. అయినా, సినిమాపై ఎలాంటి బజ్ ను క్రియేట్ చేయలేకపోయాయి. దీంతో స్వీటీ ఫ్యాన్స్ తీవ్రమైన అప్‌సెట్ లో ఉన్నారు.

ఇప్పుడు స్వీటీ ఫ్యాన్స్ నమ్ముకుంది ట్రైలర్ ను మాత్రమే. దీంతో అనుష్క శెట్టి మూవీ భవిష్యత్తు తెలిపోతుందని క్రిటిక్స్ అంటున్నారు. రాబోయే ట్రైలర్ సినిమాపై బజ్ పెంచితే, మంచి ఓపెనింగ్స్ వస్తాయి. వీకెండ్ లో కలెక్షన్లు పెరుగుతాయి. ఒక వేళ ట్రైలర్ పై నెగిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమా రిజల్ట్ పై తీవ్ర ప్రభావం చూపొచ్చు.

దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు యూవీ క్రియేషన్స్ ట్రైలర్ ను కట్ చేయాలి. ఈ మూవీ హిట్ అవ్వడం ఒక అనుష్క శెట్టికే కాదు.. నిర్మాతలు యూవీ క్రియేషన్స్ కి కూడా కీలకమే. ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇటీవల వచ్చిన సాహో, రాధేశ్యామ్ చేదు ఫలితాలను ఇచ్చాయి. ఇప్పుడు వీరికి కూడా ఈ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిపై ఆశలన్నీ ఉన్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

Previous article
Next article

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు