Megastar : రంగంలోకి దిగాడు..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలుసు. ఆచార్య తర్వాత వరుసగా సినిమాలకు సైన్ చేసిన చిరంజీవి, అంతే స్పీడ్ గా షూటింగ్ లను పూర్తి చేస్తున్నాడు. మెగాస్టార్ చేతిలో ఉన్న సినిమాల్లో గాడ్ ఫాదర్ షూటింగ్ దాదాపు పూర్తి అయింది. ఈ సినిమాను దసరా కానుకగా వచ్చే నెల 5న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నారు. దీంతో పాటు భోళా శంకర్, సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ప్రస్తుతం భోళా శంకర్ షూటింగ్ కు బ్రేక్ పడింది.

కాగా వీటితో పాటు మెగాస్టార్ తన కెరీర్ లో 154వ సినిమాను బాబి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఒక సందర్భంలో స్వయంగా మెగాస్టార్ ఈ సినిమా టైటిల్ వాల్తేరు వీరయ్య అని చెప్పాడు. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా మాస్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా భోళా శంకర్ షూటింగ్ కు బ్రేక్ వచ్చిన తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాపై చిరు ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న వాల్తేరు వీరయ్య, తాజాగా మరో షెడ్యూల్ ప్రారంభమైంది. తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతానికి వాల్తేరు వీరయ్య షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తి అయింది. తాజా షెడ్యూల్ లో మెగాస్టార్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. కాగా ఈ వాల్తేరు వీరయ్య సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరిలో విడుదల చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు