Shraddhadas: పెళ్లి పీటలెక్కనున్న శ్రద్ధాదాస్.. వరుడుపై ఫైనల్‌గా ఓపెన్ అయింది..?

Shraddha Das: సాధారణంగా ఏ ఇండస్ట్రీలో నైనా హీరో హీరోయిన్ల గురించి ఎప్పుడూ కూడా ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది . ముఖ్యంగా హీరోయిన్ ల ప్రేమ , పెళ్లి, డేటింగ్ వ్యవహారాలకు సంబంధించి పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. ఫలానా వ్యక్తితో డేటింగ్ లో ఉందంటూ.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ.. ఇలా ఎన్నో వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.. అయితే ఇప్పుడు తాజాగా ఇలాంటి న్యూస్ మళ్ళీ తెరపైకి వచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరుపొందిన శ్రద్ధాదాస్ గురించి గత కొద్దిరోజులుగా ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.

గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఈమె ఒక బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ లో ఉందంటూ.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది అంటూ రూమర్స్ రావడం జరిగింది. ఈ విషయం పై స్వయంగా ఈమె క్లారిటీ ఇచ్చేసింది.. శ్రద్ధా దాస్ అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత డార్లింగ్, ఆర్య-2, ఏక్ మినీ కథ వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. కానీ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకోలేకపోయింది.

బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి పలు రకాల డ్యాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది.. తాజాగా పెళ్లి రూమర్స్ పై వచ్చిన వార్తల పై శ్రద్ధాదాస్ మాట్లాడుతూ.. తన పై వచ్చిన రూమర్స్ లో ఎలాంటి నిజము లేదని.. అవన్నీ కేవలం అవాస్తవాలేనంటూ తెలిపింది.. తాను ఏ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ లో లేనని.. చాలా స్పష్టంగా తెలియజేసింది. దీంతో తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు ఈ ముద్దుగుమ్మ చెక్ పెట్టేసింది.. మరి ఈ విషయం పై ఇకనైనా రూమర్స్ ఆగుతాయేమో చూడాలి మరి.

- Advertisement -

ఇకపోతే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఇప్పటికీ వెలువడుతూనే ఉన్నాయి కానీ సరైన సక్సెస్ మాత్రం లభించడం లేదు. శ్రద్ధాదాస్ కి ఆకట్టుకునే అందం అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసి రాలేదని చెప్పవచ్చు.. మరి ఈ ఏడాదైన సరైన కథలను ఎంచుకొని మరీ అభిమానులను మెప్పిస్తుందేమో చూడాలి.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు