Hero Nithiin: షూటింగ్లో నితిన్ కి ప్రమాదం.. ఆందోళనలో అభిమానులు..!!

Hero Nithiin: తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో గా పేరు సంపాదించిన హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎన్నో విభిన్నమైన చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నితిన్ టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా మరింత మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే గడిచిన కొన్నేళ్లుగా నితిన్ సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. గత ఏడాది కూడా భారీ అంచనాల మధ్య విడుదలైన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా భారీ డిజాస్టర్ గా మిగలడమే కాదు ఈ సినిమా నిర్మించి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయారు.

అయితే ఈసారి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ సరైన కథను ఎంపిక చేసుకొని.. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు అనే సినిమా టైటిల్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ చిత్రానికి డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమా పై మంచి హైప్ ఏర్పడుతోంది. వీటితో పాటుగా దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.

ఇలాంటి సమయంలో హీరో నితిన్ కు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.. అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమా షూటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి ప్రాంతానికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని.. అలా ప్రమాదం జరిగిన వెంటనే సినిమా షూటింగ్ నిలిపివేసి నితిన్ ని అక్కడ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.. అయితే ఇందులో యాక్సిడెంట్ సన్నివేశాలు కావడంతో నితిన్ చేతికి చాలా తీవ్రమైన గాయాలయ్యాయని.. దీంతో వైద్యులు కనీసం 15 రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు చిత్ర బృందం తెలియజేసింది.

- Advertisement -

నితిన్ కూడా తమ్ముడు సినిమా పైన చాలా నమ్మకంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ కూడా అక్క తమ్ముడు సెంటిమెంట్ నేపథ్యంలో సాగే కథాంశం అన్నట్లుగా సినీ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ తో నైనా నితిన్ ఏ మేరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి మరి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు