Manchu Manoj : ‘కృతజ్ఞతలు చెప్పి సరి పెట్టలేను’

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండో తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన నటనతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు మంచు మనోజ్. మంచు మనోజ్ పదవ ఏటనే మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు. 2004లో “దొంగ దొంగది” సినిమాతో హీరోగా సినీ ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ తరువాత “బిందాస్”, “పోటుగాడు”, “వేదం” వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించాడు. “కరెంట్ తీగ” చిత్రంతో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించాడు. అయితే మంచు మనోజ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ లేఖను పంచుకున్నాడు మంచు మనోజ్.

“నేను తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు పూర్తి అయింది. ఈ ప్రయాణం నేను నటుడుగా మాత్రమే కాకుండా ఒక వ్యక్తిగా నాకు చాలా ప్రత్యేకమైనది. నా ప్రేక్షకులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్, సహానటులు, మీడియాకు కృతజ్ఞతలు చెప్పి సరి పెట్టలేను. నా మొదటి సినిమా నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, అశోక్ నాపై మీకున్న విశ్వాసం ఈ పరిశ్రమలో నా ఎదుగుదలకు తోడ్పడింది. “దొంగ దొంగది” నాకు ప్రత్యేకమైన చిత్రం. సుబ్రహ్మణ్యం, అజయ్ విన్సెంట్ కు కృతజ్ఞతలు. నేను సినిమాలకు దూరంగా ఉన్నా.. మీ హృదయాల్లో నాకు చోటిచ్చారు. ఈ విరామ సమయంలో నా కుటుంబం, అమ్మ ,నాన్న, అన్న, ప్రత్యేకించి అక్క వీరి ప్రేమ నన్ను మరింత దృఢంగా మార్చింది. అందరి ఆశీర్వాదంతో త్వరలోనే మీ ముందుకు వస్తానని వాగ్దానం చేస్తున్నాను”. అంటూ మంచు మనోజ్ భావోద్వేగా లేఖను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

ప్రస్తుతం మంచు మనోజ్ “అహం బ్రహ్మాస్మి” చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా రోజులు అవుతున్నా.. ఇప్పటివరకు ఈ చిత్రం నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా మంచు మనోజ్ రాసిన ఈ భాగోద్వేగ లేఖతో త్వరలోనే ఈ చిత్రం నుండి ఓ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు