Vijay Deavarakonda : ఇదెక్కడి మాస్ ఫాలోయింగ్ రా !

విజయ్ దేవరకొండ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “లైగర్”. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తో పాటు బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ లో విజయ్ దేవరకొండ బాడీ, యాక్టింగ్ చూసి జనాలు ఫిదా అయిపోయారు. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది మూవీ యూనిట్. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తనదైన శైలిలో జనాల్లోకి వెళ్ళి ప్రమోషన్స్ చేస్తున్నాడు.

ఇటీవల ముంబైలో ఓ మాల్ లో నిర్వహించిన లైగర్ ప్రమోషన్స్ లో విజయ్ ఎంట్రీ తో అభిమానులు అరుపులతో హోరెత్తించారు. ఏకంగా అమ్మాయిలు విజయ్ ని నేరుగా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయ్ ని చూసేందుకు పోటా పోటీగా వేదిక వద్దకు దూసుకు రావడంతో తొక్కిసలాట వాతావరణం నెలకొంది. దీంతో విజయ్, అనన్య ఈవెంట్ మధ్యలో నుండే వెళ్లిపోవలసి వచ్చింది. తాజాగా ఇలాంటి ఘటననే బీహార్ లో చోటు చేసుకుంది.

లైగర్ ప్రమోషన్స్ లో భాగంగా బీహార్ లోని ఫ్యాన్స్ ను విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా కలుసుకున్నాడు. ఈ ఈవెంట్ లో కూడా జనాల తాకిడి ఎక్కువ కావడంతో నిర్వాహకులు క్యాన్సిల్ చేశారు. ఏఎన్ కాలేజీలో భారీగా యువత ఎగబడడంతో విజయ్ దేవరకొండ కనీసం అక్కడికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీన్నీ చూసి విజయ్ దేవరకొండకు బీహార్ లో కూడా ఇంత ఫాలోయింగ్ ఉందా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ తెలుగు హీరో పవర్ చూసి అందరూ నోరేళ్లబెట్టారు. ఇదేక్కడి మాస్ ఫాలోయింగ్ రా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రమోషన్స్ తోనే రికార్డులు నమోదు చేస్తున్న లైగర్ సినిమా, బాక్సాఫీసు వద్ద ఎలాంటి రికార్డులను అందుకుంటుందో వేచి చూడాలి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు