SSMB28: మహేష్ బాబు కూతురు సితార లేటెస్ట్ యాడ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

టాలీవుడ్ లో యాక్టర్స్ మాత్రమే కాదు, వాళ్ళ పిల్లలకి కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఫ్యాన్స్ అంత తమ అభిమాన హీరోల సినిమాల కోసం ఎంత వెయిట్ చేస్తారో, వాళ్ళ పిల్లల డెబ్యూ సినిమాల కోసం కూడా అంతే ఈగర్ గా వెయిట్ ఇస్తారు. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.

టాలీవుడ్ సూపర్ మహేష్ బాబు కూతురు సితార ఇటీవలనే ఒక యాడ్ లో నటించిన విషయం అందరికి తెల్సిందే కాగా ఈ యాడ్ లో సితార యాక్ట్ చేయడానికి గాను భారీ రెమ్యునరేషన్ తీసుకుందట.అయితే సితారకి నటించడం కొత్తేమి కాదు. గతంలో కూడా సితార, మహేష్ నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పెన్నీ అనే సాంగ్ కి డాన్స్ వీడియో చేసి, అందరిని ఆకట్టుకుంది. అంతేకాకుండా సితారకి పర్సనల్ గా ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. రెగ్యులర్ ఆ ఛానల్ లో డాన్స్ వీడియోస్ లాంటివి అప్లోడ్ చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. ఆ మధ్య ఈ యూట్యూబ్ ఛానల్ కి మహేష్ గెస్ట్ అటెండ్ అవ్వగా, సితార..మహేష్ ని ఇంటర్యూ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇవే కాకుండా సితార మహేష్ తో కలిసి కొన్ని యాడ్స్ లో కూడా నటించింది.

అయితే సితార లేటెస్ట్ గా ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ పిఎంజె జ్యూవెలర్స్ కి బ్రాండ్ అంబాసిటర్ గా, ఒక యాడ్ లో యాక్ట్ చేసింది. ఈ యాడ్ కి గాను సితారకి ఆ సంస్థ అక్షరాలా రెండు కోట్ల రెమ్యునరేషన్ ముట్టజెప్పిందట. ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ ఒక స్టార్ కిడ్ ఇవ్వడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు అంటున్నారు . మహేష్ కూడా యాడ్ లకి భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అది గాక మహేష్ చాలా కంపెనీ లకి బ్రాండ్ అంబాసిటర్ గా కూడా వ్యవహరిస్తుంటారు. అందుకే తండ్రికి ఏమాత్రం తగ్గకుండా సితార భారీ స్థాయిలోనే తీసుకుందని ఇండస్ట్రీలో అందరు మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు