Macherla Niyojakavargam : ఫుల్ యాక్షన్.. ఫుల్ కామెడీ

యంగ్ హీరో నితిన్ నుంచి వస్తున్న తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఇప్పటి వరకు ఎడిటర్ గా పని చేసిన ఎం.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో తొలిసారి డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. యంగ్ హీరో నితిన్ కు జోడీగా ఉప్పెన భామ కృతి శెట్టి నటిస్తుంది. అలాగే కేథిరిన్ థ్రెసా కీలక పాత్రలో, స్పెషల్ సాంగ్ లో అంజలి నటించారు. చాలా కాలంలో నుంచి సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న నితిన్ మాచర్ల నియోజకవర్గం పై అంచనాలు విపరీతంగా పెట్టుకున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన పాటలతో పాటు ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను గుంటూర్ జిల్లాలోని బ్రోడీపేట లో జరుపుకున్నారు. ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ లో నితిన్ యాక్షన్, కామెడీ బాగా నచ్చుతుంది. దీంతో పాటు సందర్భాన్ని బట్టి కృతి శెట్టి, కేథిరిన్ థ్రెసా తో నితిన్ రొమాన్స్ కూడా బాగానే ఉంది.

”ఇవాళ వైజాగ్ చాలా కొత్తగా కనిపిస్తుందిరా” అనే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అలాగే ”నువ్వేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచులు, వీళ్లుమో బోయాపాటి శ్రీను యాక్షన్, ఇప్పుడు నేనేం చేయ్యాలి.. రాజమౌళి హీరోలా ఎలివేషన్ ఇవ్వాలా” తో పాటు మరికొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. కాగా ట్రైలర్ లోనే సినిమా స్టోరీని మొత్తం చెప్పే ప్రయత్నం చేశారు.

- Advertisement -

అది ఏంటంటే మాచర్ల నియోజకవర్గంలో ఓటమి ఎరుగని నేతగా రాజప్పగా సముద్ర ఖని ఉంటాడు. ఆ సమయంలో సిద్దార్థ్ రెడ్డి అనే కలెక్టర్ పాత్రలో హీరో నితిన్ అక్కడ ఎన్నికలను న్యాయంగా జరిపిస్తాడు. ఈ క్రమంలో జరిగిన యాక్షన్, కామెడీ సీన్స్ సినిమాలో చూపిస్తున్నట్టు తెలుసిపోతుంది. కొత్త డైరెక్టర్ అయినా సినిమాలో యాక్షన్, కామెడీ, రొమాన్స్ సమానంగా ఉండేలా చూసుకున్నాడు. కాగ ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగానే పెంచింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు