NTR30: కొరటాల కొట్టాల్సిందే.. నో కంప్రమైజ్

నందమూరి అభిమానులకు మాస్ జాతర స్టార్ట్ కాబోతుంది. దాదాపు ఏడాది కాలంలోగా ఎదురుచూసిన NTR30 సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉంది. ఏప్రిల్ నుంచి ఈ మోస్ట్ అవెయిటెడ్ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. దీని కోసం కొరటాల ఇప్పటి నుంచి పనులను స్టార్ట్ చేస్తూన్నాడు. త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్స్ వేస్తున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ కు ఇది గ్లోబల్ గా సక్సెస్ అయిన ఆర్ఆర్ఆర్ తర్వాత సినిమా.

దీంతో తెలుగు ఆడియన్స్, పాన్ ఇండియా ఆడియన్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా తారక్ నుంచి రాబోయే సినిమాలపై ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది తారక్ కే కాదు.. డైరెక్టర్ కొరటాల శివకు కూడా పెద్ద సవాలు లాంటింది. కొరటాలకు ఇప్పటికే ఆచార్య డిజాస్టార్ తో కొంత నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. అది పోవాలంటే, NTR30 తప్పకుండా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిదే. అందుకు కొరటాల బాగానే కష్టపడుతున్నాడని తెలుస్తోంది.

తాజాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ తన ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో డైరెక్టర్ కొరటాల శివ NTR30కి సంబంధించిన పనులు చేస్తున్నాడు. పెద్ద షిప్ లో ఎదో ప్లాన్ చేస్తున్నాడు. అది బాగానే ఉన్నా.. పక్కన హాలీవుడ్ యాక్షన్ ప్రొడ్యూసర్ కెన్నీ బేట్స్ కనిపించాడు. కెన్నీ బేట్స్ హాలీవుడ్ లో ఫేమస్ యాక్షన్ కొరియేగ్రాఫర్. ఈయన తెలుగులో ప్రభాస్ నటించిన సాహో మూవీకి కూడా యాక్షన్ ప్రొడ్యూసర్ గా చేశాడు.

- Advertisement -

ఇప్పుడు తారక్ మూవీకి కెన్నీ బేట్స్ ను రంగంలోకి దింపాడు డైరెక్టర్ కొరటాల. NTR30 ఫుల్ యాక్షన్ తో ఉంటుందని డైరెక్టర్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. తాజాగా కెన్నీ బేట్స్ మూవీ టీంలోకి రావడంతో యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించవచ్చు అని నందమూరి అభిమానులు అంటున్నారు. అలాగే NTR30ని గ్లోబల్ హిట్ కొట్టి, తన సక్సెస్ రేట్ మళ్లీ సంపాదించుకోవాలని కొరటల చూస్తున్నాడని, అందుకే ఎక్కడ కూడా కంప్రమైజ్ కాకుండా మూవీని తెెరకెక్కిస్తున్నాడని అంటున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు