Katrina Kaif : హీరోయిన్ కాలేనని అన్నారు

బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరోయిన్ 15 సంవత్సరాలకు మించి టాప్ హీరోయిన్ గా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ హీరోల ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఇండియాలో చాలా అరుదు. వారానికి ఒక కొత్త హీరో పరిచయం అవుతున్న నేపథ్యంలో కత్రినా కైఫ్ మాత్రం తన డిమాండ్ ను ఏమాత్రం తగ్గించుకోకుండా చక్కగా మెయింటైన్ చేస్తూ వస్తోంది.

బాలీవుడ్ సినీ పరిశ్రమలో అగ్రతారగా ఎదిగిన కత్రినా కైఫ్ మొదటిగా తెలుగులో మల్లీశ్వరి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ సినిమాలలోనే కాదు సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా తన సినీ కెరీర్ గురించి కొన్ని కీలక విషయాలను వెల్లడించింది కత్రినా కైఫ్. “సాయ” అనే చిత్రంలో ఒకే ఒక షార్ట్ చిత్రీకరణ తర్వాత తనని ఆ సినిమా నుంచి తొలగించారని గుర్తుచేసుకుంది.

ఓ నటికి ఉండాల్సిన మంచి లక్షణం కూడా తనలో లేదన్నారని ఆవేదనకు గురి అయింది. ఆ రోజు తోనే తన కెరీర్ ముగిసిందని చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది. అయితే ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ నటిని కావాలన్న లక్ష్యాన్ని వదులుకోలేదని.. తిరస్కారాలు తట్టుకొని నిలబడ్డాను కాబట్టే దాదాపు రెండు దశాబ్దాల నటప్రస్థానం సాగిస్తున్నానని తెలిపింది కత్రినా కైఫ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు