Kangana: నేను వారిలా హీరోల రూమ్​కు వెళ్లను

బాలీవుడ్ హీరోయిన్ కంగానా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె పేరు లేకుండా ఏ ఒక్కరోజు కూడా వార్తలు రావంటే అతిశయోక్తి కాదు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉండే కంగానా తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ నెటిజన్ కంగానా తల్లి పొలంలో పనిచేస్తున్న ఫోటోని పోస్ట్ చేశాడు. ‘కంగానా చాలా ధనవంతురాలు కదా, మరి ఆమె తల్లి ఇంకా పొలంలో ఇలా పని చేసుకుంటుంది. అంతటి సింప్లిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది’ అని ప్రశ్నించాడు.

అయితే ఆ పోస్ట్ ను రీట్వీట్ చేసిన కంగానా, ‘నేను ధనవంతురాలు అవ్వడం వల్ల నా తల్లి ధనవంతురాలు కాదు. నేను రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తల కుటుంబం నుంచి వచ్చాను. మా అమ్మ 25 ఏళ్లకు పైగా టీచర్ గా ఉంది. సినిమా మాఫియా మీద నేను చూపిస్తున్న వైఖరి ఎక్కడి నుంచి వచ్చిందో మీకు అర్థమైపోయింది అనుకుంటా. మా అమ్మ అన్ని నేర్పించింది. నేను సినిమా మాఫియాలోని వాళ్ళలాగా పెళ్లిళ్లలో డబ్బుల కోసం డ్యాన్సులు వేయను’ అని చెప్పింది.

అలాగే తన తల్లి పొలంలో పనిచేసే ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ‘మా అమ్మ ప్రతిరోజు మా పొలంలో దాదాపు 7 గంటలు పని చేస్తుంది. మా అమ్మకు బయట రెస్టారెంట్ లో తినడం, విదేశాలకు వెళ్లడం, సినిమాలు చూడడం, సినిమా సెట్స్ కు రావడం, ముంబైలో నివసించడం కూడా నచ్చదు. వీటిల్లో ఏదైనా చేయమని నేను బలవంత పెడితే నన్ను తిడుతుంది. సినిమా మాఫియాను నేను వ్యతిరేకించడం అందరూ నా ఆహంకారం అంటారు. కానీ నేను మా అమ్మ చెప్పిన వ్యక్తిత్వాన్ని పాటిస్తున్నాను. నేను ఎవరిని వేడుకోను. వేరే హీరోయిన్స్ లాగా సిగ్గుపడను, పెళ్లిళ్లలో డ్యాన్సులు చేయను, హీరోల గదిలోకి వెళ్ళను, అందుకే వాళ్ళు నన్ను పట్టించుకోరు. మీరే చెప్పండి. ఇది అహంకారామా? చిత్తశుద్దా?’ అని పోస్ట్ చేసింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు