Birthday special: కమెడియన్ సునీల్ గురించి ఆసక్తికర విషయాలు

కమెడియన్ సునీల్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలతో హాస్యం పండించిన తర్వాత హీరో అవతారం ఎత్తిన కామెడీ హీరో సునీల్. ఇండస్ట్రీలో కమెడియన్ గా, హీరోగా, విలన్ గా వేరు వేరు పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మొదట ఇండస్ట్రీలోకి విలన్ అవుదామని వచ్చిన సునీల్ ఊహించని విధంగా కమెడియన్ అయ్యారు. ఆ తరువాత మళ్లీ విలన్ అయ్యారు.

“నువ్వే కావాలి” సినిమా సునీల్ కు కమెడియన్ గా మంచి పేరును తెచ్చిపెట్టింది. అందాల రాముడుతో అలరించిన తర్వాత మర్యాద రామన్న, పూలరంగడుగా సందడి చేసి ప్రస్తుతం విలన్ గా దూసుకుపోతున్న సునీల్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సునీల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1974లో పుట్టిన సునీల్ తన బాల్యం భీమవరంలోనే గడిపారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన సునీల్ ను తల్లి పెంచి పెద్ద చేసింది. ఈయన మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. విలన్ అవ్వాలని కోరికతో సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కూడా కొన్ని సినిమాలకు సునీల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ సునీల్ రూమ్ మేట్స్. సునీల్ ది పెద్దలు కుదిర్చిన వివాహం. ఈయన భార్య పేరు శృతి ఇందుకూరి. కాగా ఈ జంటకు ఒక పాప, బాబు ఉన్నారు.

- Advertisement -

ఇక దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో చేసిన మర్యాద రామన్న చిత్రం సునీల్ కెరీర్ లో మరిచిపోలేనిదిగా మిగిలిపోయింది. అలాగే హీరోగా సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శించిన సునీల్ సిక్స్ ప్యాక్ తో సైతం అలరించాడు. ఇక ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో విలన్ గా కూడా నటించాడు. ఇందులో సునీల్ పోషించిన మంగళం శ్రీను పాత్రకి మంచి అప్లాజ్ వచ్చింది. క్యారెక్టర్ ఏదైనా తనదైన నటనతో మెప్పిస్తున్న సునీల్ మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు