Salaar : ప్రశాంత్ నీల్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన జగపతి బాబు

ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం సలార్. కేజీయఫ్ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు పార్ట్ లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాని హోంబేలె ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుంది. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలకి సిద్దమవుతుంది.

పీరియాడిక్ యాక్షన్ సినిమాలు తీయడంలో మాస్టర్ అయిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాని హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా సలార్ ని తెరకెక్కిస్తున్నారు. గతంలో ప్రశాంత్ నీల్ కేజీయఫ్ సినిమా పార్ట్1 షూటింగ్ చేసిన తరువాత కేజీయఫ్ పార్ట్ 2 కి సమయం తీసుకొని షూట్ చేసారు. కానీ సలార్ సినిమాని ప్రశాంత్ నీల్ రెండు పార్ట్ లని ఒకేసారి షూట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాని పాన్ ఇండియా దాటి ఇంగ్లీష్ అండ్ ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలనే శంషాబాద్ లో జరిగిన ఈ సినిమా షూటింగ్ లో జగపతిబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రశాంత్ నీల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

గోపిచంద్ హీరోగా వస్తోన్న రామబాణం సినిమాలో నటిస్తున్న జగపతిబాబు, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ ” సలార్ సినిమాలో నేను ఏ క్యారెక్టర్ చేస్తున్నానో నాకే తెలీదు, ఇప్పటికి నాపై ఒక్క సీన్ మాత్రమే షూట్ చేసారు. ఆ సిన్ ఫినిష్ చేయడానికే ప్రశాంత్ నీల్ అయిదు రోజులు టైం తీసుకున్నారు. నేను ప్రశాంత్ నీల్ ని  క్యారెక్టర్ ఏంటి అని కూడా అడగలేదు,  షూటింగ్ లో  ఆయన క్లారిటీ నాకు బాగా నచ్చింది అందుకే ఆయన ఎం చెప్తే అదే చేశాను. క్లారిటీ ఉన్న దర్శకులతో పని చేస్తే యాక్టర్స్ పని ఈజీ అవుతుంది. ప్రశాంత్ నీల్ అలాంటి దర్శకుడే. ఎక్కువ లెన్త్ ఉన్న సిన్ ని కూడా ఆయన సింగిల్ టేక్ లో ఒకే చేస్తారు ” అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు