రాజకీయాల్లోకి హీరో విశాల్ ఎంట్రీ.. !

తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ్ హీరో విశాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తెలుగువాడైనప్పటికీ తమిళంలోనే హీరోగా స్థిరపడిపోయాడు విశాల్. అటు తమిళ్ చిత్ర పరిశ్రమ మరియు ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో విశాల్ కు మంచి క్రేజ్ ఉంది. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో విశాల్. ఇదిలా ఉంటే.. విశాల్ పొలిటికల్ ఎంట్రీ మరోసారి చర్చనీయాంశంగా మారింది. విశాల్ చేసే పనులు ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. సందర్భం కోసం వేచి చూడకుండా అనుకున్న పనిని వెంటనే చేసేయడం అతనికి అలవాటు. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయినప్పుడు కూడా ఆమె నియోజకవర్గంలో నుంచి సడన్ గా ఉపఎన్నికలలో పోటీకి సిద్ధమయ్యారు విశాల్. నామినేషన్ కూడా వేసినప్పటికీ అది రిజెక్ట్ అయింది.
ఇప్పుడు తాజాగా విశాల్ చేసిన ఓ పని కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ ఫోటోని గుండెల పై టాటూ వేయించుకున్నాడు విశాల్. ఎంజీఆర్ అంటే తనకు ప్రాణం అంటూ విశాల్ చాలా సందర్భాలలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏ సందర్భమూ లేకుండా విశాల్ తన ఛాతిపై ఎంజీఆర్ టాటూ వేయించుకోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో వచ్చే ఎన్నికలలో విశాల్ అన్న డిఎంకె తరఫున ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నారని, ఆ పార్టీకి దగ్గరయ్యేందుకే ఎంజీఆర్ టాటూ ని వేయించుకున్నారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు అది పర్మినెంట్ టాటూ కాదేమో? ఏదైనా సినిమా కోసం ఇలా టాటూ వేయించుకున్నారేమోనన్న అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ టాటూ వెనక అసలు కారణాలు తెలియాలంటే విశాల్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు