Hanuman: అంత మంది హీరోయిన్లతో రొమాన్స్ అవసరమా?… మాస్ మహారాజాకు మొహం మీదే ఇచ్చిపడేసిన తేజ సజ్జ

Hanuman:  క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, కుర్ర హీరో తేజ సజ్జ కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ “హనుమాన్”. ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌తో ఇంకా జనాలను థియేటర్లలోకి రప్పిస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా 15 రోజుల్లోనే 250 కోట్లను కొల్లగొట్టిన ఈ “హనుమాన్” మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం రిలీజై 15 రోజులు దాటిపోతున్నప్పటికీ థియేటర్లలో ఇంకా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా చిత్ర బృందం హనుమాన్ గ్రాటిట్యూడ్ మీట్ పేరుతో సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ మూవీలో కోతి పాత్రకు మాస్ మహారాజా రవితేజ ఇచ్చిన వాయిస్ ఓవర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే రవితేజపై తేజ తాజాగా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

ఫిబ్రవరి 9న రవితేజ హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “ఈగల్” థియేటర్లలోకి రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో రవితేజ, “హనుమాన్” హీరో తేజ సజ్జ కలిసి పలు ఆసక్తికరమైన విషయాలను డిస్కస్ చేశారు. ఈ క్రమంలోనే తేజ ఓ ఫన్నీ సమస్యను రవితేజ ముందు ఉంచాడు.

- Advertisement -

రవితేజ వల్ల ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త హీరోలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆయన చేసే ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్లను ఎందుకు తీసుకుంటున్నారని తేజ డైరెక్ట్ గా ప్రశ్నించాడు. తేజ మాట్లాడుతూ “మీ వల్ల ఇండస్ట్రీకి వచ్చే మాలాంటి యంగ్ హీరోలకు హీరోయిన్ దొరకక చాలా ప్రాబ్లం అవుతుంది. మొత్తం మీద కలిపి చూసుకుంటే 15 మంది హీరోయిన్లు మాత్రమే ఉంటారు. కానీ మీరు చేసే సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు. మీరు ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్నారు. అంటే దాదాపు 12 మందిని ఆడిషన్స్ చేస్తారు. దీంతో మేము ఏ హీరోయిన్ ను అడిగినా రవితేజ సినిమా చేస్తున్నాం, అదయ్యాకే మీ మూవీ చేస్తామని చెబుతున్నారు. మీరు ఇలా ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ను తీసుకోవడం వల్ల మాలాంటి యంగ్ హీరోలకు ఇబ్బందులు తప్పట్లేదు” అంటూ రవితేజను అడిగేసాడు తేజ.

ఆ ప్రశ్నకు రవితేజ స్పందిస్తూ “నేనేమైనా ఇద్దరు హీరోయిన్లను పెట్టమన్నానా ఏంటి? ఒక హీరోయిన్ ఉంటే సినిమా బాగుంటుంది. అలాగే ఇద్దరు హీరోయిన్లు ఉంటే ఇంకా కలర్ ఫుల్ గా ఉంటుంది కదా అని అనుకుంటాను అంతే” అంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న రవితేజ లేటెస్ట్ మూవీ “ఈగల్”లో కూడా కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ ఇద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతం అవుతున్న రవితేజ “ఈగల్” మూవీతో ఫిబ్రవరి 9న తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరి ఈ మూవీ రవితేజకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు