Nani : తెలంగాణ యాసలో

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని గత ఏడాది హీరోగా నటించిన చిత్రం ” శ్యామ్ సింగరాయ్”. ఈ సినిమాతో నాని మంచి సక్సెస్ అందుకున్నారు. ఇటీవల ” అంటే సుందరానికి” అనే ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌తో మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం నాని “దసరా” అనే సినిమాలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించడానికి సిద్ధమవుతోంది.ఈ సినిమాలో నాని లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకులలో మంచి ఆసక్తిని నెలకొల్పాయి.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ‌ వైరల్ అవుతోంది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ తెలంగాణ యాసలో ఉండే ఓ జానపద పాట అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక ఈ చిత్రాన్ని మార్చి 30, 2023న విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు